అనంతపురం జిల్లా పెనుకొండ మండలం కురుబవాండ్లపల్లిలో సురేష్(23) అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు 2016 లో డిగ్రీ పూర్తి చేశాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, ఉద్యోగం రాలేదని మనస్థాపానికి గురై గ్రామసమీపంలోకి పశువులు మేపటానికి వెళ్లి అక్కడే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు. మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఇదీచూడండి.7 అడుగుల కొండచిలువ చేతిలో జింక బలి