ETV Bharat / state

ఆస్తి తగాదా: తోడల్లుడిపై వేట కొడవళ్లతో దాడి - Crime news in Atmakuru Zone Goridindla Village Anantapur District

ఆస్తి తగాదా.. ఓ వ్యక్తిపై హత్యాయత్నానికి దారి తీసింది. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం గోరిదిండ్ల గ్రామంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆస్తి తగాదాతో సడ్డుకుడిపై వేటకొడవళ్లతో దాడి

author img

By

Published : Dec 12, 2020, 8:09 AM IST

అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం గోరిదిండ్ల గ్రామంలో దారుణం జరిగింది. వెంకటేష్ అనే వ్యక్తిపై వరసకు తోడల్లుడు అయిన శివలింగ, అతని కుమారుడు నరేష్ హత్యాయత్నం చేశాడు. పొలం పనులు ముగించుకుని వస్తున్న అతనిపై వేటకొడవళ్లతో దాడి చేసినట్లు.. వెంకటేష్ బంధువులు ఆరోపించారు.

అక్కాచెల్లెళ్లను వెంకటేష్, శివలింగ పెళ్లి చేసుకున్నారు. ఆ అక్కా చెల్లెళ్లకు సంబంధించిన భూమి అమ్మకం వ్యవహారమే.. గొడవకు కారణమైంది. పెద్ద వారికి ఎక్కువ మోతాదులో నగదు అందుతోందని గొడవ మొదలైంది. కక్ష పెంచుకున్న శివలింగ, అతని కుమారుడు నరేష్.. శుక్రవారం సాయంత్రం వెంకటేష్​పై దాడి చేసినట్లు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

'అనాథ పిల్లలతో వ్యాపారాలు చేయిస్తే కఠిన చర్యలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.