అనంతపురం జిల్లా శివరాంపేట సమీపంలో బస్సు, ఆటో ఢీకొని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో రాఛానపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులు తెలిపిన వివరాల ప్రకారం... కేశఖండన కార్యక్రమానికి పెన్నహోబిళం వెళుతుండగా కుడేరు మండలం, శివరాంపేట గ్రామ సమీపంలో వెనక నుంచి వచ్చిన కర్ణాటక ఆర్టీసీ బస్సు.. వీరి ఆటోను ఢీ కొట్టింది. బాధితులు జిల్లా సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చూడండి