అనంతపురం జిల్లాలో 3వ రోజు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా పోలీసులు, సీడబ్ల్యూసీ, ఐసీడీఎస్ కార్మిక శాఖ, గ్రామ సంరక్షణ కార్యదర్శులు.. వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలసి సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి హోటళ్లు, ఇటుక బట్టీలు, మెకానిక్ షెడ్లు, వివిధ దుకాణాలు, తదితర వ్యాపార సముదాయాల్లో దాడులు నిర్వహించారు.
జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. బాలలతో పని చేయించడం చట్ట విరుద్ధమని.. ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఇదీ చదవండి..