కొవిడ్ మరణాల కంటే రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్యే అధికంగా ఉందని అనంతపరం జిల్లా మడకశిర ఆర్టీవో రమేష్ అన్నారు. పట్ణణంలో 32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు పోలీసులు బైకు ర్యాలీ చేపట్టారు.
డ్రైవర్లు రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయొద్దని హితవు పలికారు. ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా నిబంధనలు పాటించాలని సూచించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దీప్తి, ఎస్ఐ శేషగిరి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి:
ఎస్ఐ మానవత్వం.. పారిపోయే క్రమంలో ప్రమాదానికి గురైన దొంగకు సపర్యలు