అనంతపురం జిల్లా గుంతకల్లులోని హనుమాన్ సర్కిల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళ, పురుషుడి ఆత్మహత్య కలకలం రేపింది. అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో ఇద్దరూ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు నిర్ధరించారు. మృతులు గుంతకల్లు మండలం ఇమాంపురం గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మి, గుత్తి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన శివారెడ్డిగా పోలీసులు గుర్తించారు.
రాజలక్ష్మి, శివారెడ్డి ఇద్దరు సమీప బంధువులు. వీరికి వేర్వేరుగా వివాహాలు జరిగాయి. అర్ధరాత్రి వేళ వారిద్దరూ అక్కడికి వచ్చి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు.. వీళ్లు ఇద్దరూ కలిసి ఆత్మహత్యకు పాల్పడడం వెనుక కారణం ఎంటి అనే కోణంలో విచారణ చేపట్టారు.
పోలీసులు చేపట్టిన ప్రాథమిక విచారణ సమాచారం ప్రకారం మృతులు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు రెండవ తేదీన ఇంటి నుంచి బయటకు వచ్చినట్టు తెలిసింది. వీరు కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. జీఆర్పీ పోలీసులు మృతదేహాలను శవ పరీక్షలు నిమిత్తమై గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: Minor love: వయసు 17 ఏళ్లు.. ముగ్గురితో ప్రే‘మాయ’ణం!