ETV Bharat / state

న్యూఇయర్ ఎఫెక్ట్.. ఏపీలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు..!

2023 effect record revenue increased in AP: నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో మద్యం పొంగిపొర్లింది. ఒక్కరోజేలోనే ఊహించని స్థాయిలో రికార్డు ఆదాయం వచ్చింది. మద్యం విక్రయాల ద్వారా భారీ ఆదాయాలే లక్ష్యంగా ప్రభుత్వం.. మద్యం దుకాణాలు, బార్లలో నిర్దేశిత సమయం కంటే అదనంగా మరో మూడు గంటలు విక్రయించేందుకు అనుమతిచ్చింది.

AP STATE
పొంగిపొర్లిన మద్యం
author img

By

Published : Jan 2, 2023, 10:13 AM IST

2023 effect record revenue increased in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సంవత్సర వేడుకల్లో మద్యం పొంగిపొర్లింది. శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.142 కోట్ల విలువైన మద్యాన్ని మందుబాబులు తాగేశారు. మద్యం విక్రయాల ద్వారా భారీగా ఆదాయాలే లక్ష్యంగా ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లలో నిర్దేశిత సమయం కంటే అదనంగా మరో మూడు గంటలు విక్రయించేందుకు ఎక్సైజ్‌ శాఖ అనుమతిచ్చింది.

దీంతో ప్రభుత్వ దుకాణాల్లో అర్ధరాత్రి 12 గంటల వరకూ, బార్లలో అర్ధరాత్రి 1 గంట వరకూ విక్రయాలు జరిగాయి. రాష్ట్రంలో సాధారణంగా రోజుకు రూ.70-72 కోట్ల మద్యం అమ్ముతారు. కానీ ఈసారి డిసెంబరు 31న ఒక్కరోజే రెట్టింపు విక్రయాలు జరిగాయి. ప్రభుత్వ దుకాణాల్లో రూ.127 కోట్లు, బార్లలో రూ.15 కోట్ల విలువైన మద్యం అమ్మారు.

''2021 డిసెంబరు 31న రూ.124 కోట్ల విలువైన మద్యం అమ్మారు. ఈసారి అదనంగా రూ.18 కోట్ల విలువైన మద్యం విక్రయించారు. 2021 డిసెంబరు 31న 1.23 లక్షల కేసుల లిక్కర్, 47వేల కేసుల బీరు విక్రయించగా, ఈసారి 1.54 లక్షల కేసుల లిక్కర్, 72 వేల కేసులు బీరు విక్రయించారు. 2020 డిసెంబరు 31 న రూ.118 కోట్లు ,2021 డిసెంబరు 31న రూ.124 కోట్లు,2022 డిసెంబరు 31 న రూ.142 కోట్లు విక్రయించారు'' అని ఎక్సైజ్‌ శాఖ అధికారులు వివరాలను వెల్లడించారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.