అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో నాల్గో విడతలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గుడిబండ మండలం సింగేపల్లి గ్రామానికి చెందిన 35 కుటుంబాలు ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో తెదేపాలో చేరాయి. అధికారంలో ఉన్న వైకాపా తమ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని... తెదేపాతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని గ్రహించి ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరామని వారు పేర్కొన్నారు.
ఇదీ చదవండి