అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వైకాపా ప్లీనరీ సమావేశంలో నేతలు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. లక్షలు ఖర్చు పెట్టినా విలువ లేదని ఆవేదన చెందారు. జెండాలు మోసిన వారి కంటే.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకే విలువ ఇస్తున్నారని ఎమ్మెల్యేల ఎదుటే నేతలు ఆరోపించారు. విశాఖ దక్షిణ నియోజక వర్గ ప్లీనరీలోనూ విభేదాలు బయటపడ్డాయి. కార్యక్రమానికి వైకాపా కార్పొరేటర్లు హాజరు కాకపోవడంపై ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: