"ఎన్నికలప్పుడు మా ఊరొచ్చారు. మళ్లీ ఇప్పుడొచ్చారు. మూడేళ్లలో చేసిన అభివృద్ధి ఏంటి?" అంటూ నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్‌ను పలువురు మహిళలు నిలదీశారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం పాతకృష్ణదేవిపేట పంచాయతీలో ఎమ్మెల్యే గణేష్ ఆదివారం పర్యటించారు.
నాగాపురం శివారు పల్లాఊరుకు చెందిన మహిళలు.. ‘గ్రామంలో బడి లేదు. గుడి లేదు. అంగన్‌వాడీ కేంద్రంతోపాటు రోడ్లు లేవు. శ్మశానం లేదు. గత ఎన్నికల్లో మీకే ఓటేశాం. సంక్షేమ పథకాల్లోనూ అన్యాయం జరుగుతోంది. రకరకాల కారణాలు చూపుతూ కాపు నేస్తం నిలిపేశారు’ అంటూ గళమెత్తారు. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే గణేష్ హామీ ఇవ్వడంతో శాంతించారు.
ఇదీ చదవండి: