ETV Bharat / state

తెదేపా నేత అయ్యన్న పాత్రుడు అరెస్టు - అనకాపల్లి జిల్లాలో అయ్యన్నపాత్రుడు అరెస్ట్

Ayyanna Patradu
అయ్యన్న పాత్రుడు
author img

By

Published : Nov 3, 2022, 6:22 AM IST

Updated : Nov 3, 2022, 12:34 PM IST

06:12 November 03

చింతకాయల రాజేశ్‌ను కూడా అరెస్టు చేసిన పోలీసులు

తెదేపా నేత అయ్యన్న పాత్రుడు అరెస్టు

తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. తెల్లవారుజామున పెద్దసంఖ్యలో అయ్యన్న ఇంటికి వెళ్లిన పోలీసులు, ఆయనతోపాటు చిన్న కుమారుడు రాజేశ్​నూ అరెస్టు చేశారు. ఇంటి గోడ కూల్చివేతలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారంటూ వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. అయ్యన్నపాత్రుడిని ఏలూరు కోర్టులో హాజరుపరుస్తామని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.

దుస్తులు మార్చుకుని వస్తానని, అయ్యన్నపాత్రుడు చెప్పినా సీఐడీ పోలీసులు దానికి అంగీకరించలేదు. అక్కడే మార్చుకోవాలని స్పష్టం చేశారు. మెడిసిన్ తెచ్చుకుంటానని చెప్పినప్పటికీ ఆయన్ను ఇంటి లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. తమతో రావాలని బలవంతపెట్టారు. ఈ సమయంలో అయ్యన్న కుటుంబసభ్యులతోపాటు స్థానికులు.. పోలీసుల్ని ప్రతిఘటించారు. దీంతో స్థానికుల సెల్ ఫోన్లను పోలీసులు లాక్కున్నారు. ఆయ్యన్నతోపాటు.. ఆయన చిన్న కుమారుడు చింతకాయల రాజేశ్ ను కూడా అరెస్టు చేశారు. కుటుంబసభ్యులకు వారిద్దరి అరెస్టు సమాచారం ఇచ్చిన పోలీసులు... వారిని ఏలూరు కోర్టులో హాజరుపరుస్తామని చెప్పి తీసుకెళ్లారు.

ఏలూరు సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్తామని చెప్పి సీఐడీ పోలీసులు అయ్యన్నపాత్రుడు, రాజేశ్​ని విశాఖ సీఐడీ కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తోంది. చివరకు విశాఖ సీఐడీ కార్యాలయానికి తరలించామని పోలీసులు చెప్పారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 3, 2022, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.