అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ ట్రజరీ(ఉప ఖజానాధికారి) కార్యాలయాధికారి అకెళ్ల సూర్య నర్సంహమూర్తిని ఏసీబీ అధికారులమని నమ్మబలికి నలభై వేల రూపాయలను దుండుగులు నొక్కేశారు. ఫోన్ చేసి డబ్బులు తీసుకున్న వ్యక్తులు నకిలీ ఏసీబీ అధికారులను తెలిసి లబోదిబోమంటున్నాడు. చేసేదిమి లేక సైబర్ క్రైం పోలీసులకు, స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి నా సర్వీస్ రికార్డు వివరాలను అడిగాడు.
ఆ తర్వాత తనపై అవినీతి అరోపణలు ఉన్నాయంటూ సెటిల్మెంట్ చేసుకోవాలని రెండు లక్షలు డిమాండ్ చేశారు. తన ఖాతాలో నలభై వేలు ఉన్నాయని.. వాళ్లు ఇచ్చిన నెంబర్కు నగదును గూగుల్ పే చేశాడు. మిగిలిన నగదు కోసం మళ్లీ ఫోన్ చేయగా తోటి సిబ్బంది గట్టిగా నిలదీయడంతో ఫోన్ కట్ చేశారు. విచారణలో నకిలీ వ్యక్తులని తెలిసిందన్నారు.
ఇవీ చదవండి: