ELAMANCHILI MLA KANNABABU : ఎలమంచిలి ఎమ్మెల్యే యువీ రమణ మూర్తి రాజు (కన్నబాబు) నియోజవర్గంలోని స్థానిక విద్యార్థిపై దురుసుగా ప్రవర్తించారు. పళ్లు పీకేస్తానంటూ విద్యార్థి పైకి దూసుకెళ్లారు. నాయకులు, స్థానికులు అడ్డుకోవటంతో వివాదం సద్దుమణిగింది. ఈ వ్యవహారమంతా వీక్షించిన స్థానికులు ఎమ్మెల్యే తీరుపై ఆసహనం వ్యక్తం చేశారు. గడపకు గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రదేశాల్లో ఈ కార్యక్రమం సాఫీగా సాగుతున్న చాలా చోట్ల ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి నిరసనలు, అడ్డగింతలు తప్పటం లేదు. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాలలోని ప్రజలు.. ఎమ్మెల్యేలు వారి వద్దకు రాగానే అసంతృప్తి గళాన్ని వినిపిస్తున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే అనకాపల్లి జిల్లా మునగపాక మండలం నాగులాపల్లిలో చోటు చేసుకోగా.. ఎలమంచిలి ఎమ్మెల్యే విద్యార్థిపై దురుసుగా ప్రవర్తించారు.
అసలు ఏం జరిగిందంటే : జిల్లాలోని ఎలమంచిలి నియోజకవర్గంలోని నాగులాపల్లి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే యువీ రమణ మూర్తి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో భాగంగా గ్రామ ప్రజలకు ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమాన్ని నిర్వహిస్తు ముందుక సాగుతున్న క్రమంలో గ్రామంలోని ఓ ఇంటికి వెళ్లి.. అక్కడ ఉన్న విద్యార్థినిని అమ్మ ఒడి అందిందా అని అడిగారు. ఆమె అందింది అని సమాధానం ఇవ్వటంతో.. అక్కడే ఉన్న మరో విద్యార్థిని ప్రశ్నించారు. దానికి సమాధానంగా మళ్ల శంకర్ అనే ఆ విద్యార్థి నగదు తనకు అందలేదని తెలిపాడు.
అమ్మ ఒడి నగదు విద్యార్థికి రాదని.. స్కూల్‌కు వస్తుందని శంకర్‌కు ఎమ్మెల్యే వివరించారు. దీంతో స్కూల్‌కు వచ్చినప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నారని విద్యార్థి ఎదురు ప్రశ్న వేశాడు. తనకు అందిన పథకాలు అందాయని చెప్తానని.. అందనివి నాకేలా వచ్చాయని అంటానని విద్యార్థి తెలిపాడు. అంతటితో ఎమ్మెల్యే యువీ రమణ మూర్తి విద్యార్థిని వెళ్లు వెళ్లు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి బదులిస్తూ.. రేపు ఎన్నికల వేళ ఓటు అడగటానికి వస్తారు కదా అప్పుడు మేము వెళ్లు వెళ్లు అంటామన్నాడు. దీంతో అసహనానికి గురైన ఎమ్మెల్యే .. పల్లు పీకేస్తా అంటూ విద్యార్ధి పైకి దురుసుగా వెళ్లారు. స్థానికులు, నాయకులు విద్యార్థిని వారించటంతో వివాదం సద్దుమణిగింది.
ఇవీ చదవండి :