ETV Bharat / state

"భూదోపిడీలు జరుగుతున్నాయని విశాఖను రాజధానిగా వద్దనడం తగదు"

JAC ROUND TABLE MEETING : భూ దోపిడీలు జరుగుతున్నాయని.. విశాఖను రాజధానిగా వద్దని ప్రతిపక్షాలు వితండవాదం చేయడం తగదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా అనకాపల్లి జిల్లా కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

JAC ROUND TABLE MEETING
JAC ROUND TABLE MEETING
author img

By

Published : Oct 21, 2022, 6:21 PM IST

ROUND TABLE MEETING : విశాఖలో భూ దోపిడీలు జరుగుతున్నాయని.. అందువల్ల అక్కడ రాజధాని వద్దని ప్రతిపక్షాలు వితండవాదం చేయడం తగదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మూడు రాజధానులకు మద్దతుగా అనకాపల్లి జిల్లా కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విశాఖలో భూ అక్రమాలు జరిగితే అందుకు సంబంధించిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేలా విశాఖను పరిపాలన రాజధానిగా వద్దని తెలుగుదేశం పార్టీ నాయకులు అనడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని బొత్స వెల్లడించారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేలా జరుగుతున్న అమరావతి పాదయాత్ర అనకాపల్లి జిల్లాలో ప్రవేశించగానే శాంతియుత నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛందంగా దుకాణాలు మూసేసి బంద్ పాటించాలని తన అభిప్రాయాన్ని జేఏసీ దృష్టికి తీసుకొచ్చారు. అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలు అభివృద్ధితో అన్ని ప్రాంత వాసులకు మేలు చేకూరేలా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని తెలిపారు. అమరావతి అభివృద్ధికి రూ.లక్షల కోట్లు కావాలని.. అదే విశాఖపట్నం పరిపాలన రాజధానికి రూ.10 నుంచి 15 వేల కోట్లు సరిపోతాయని వెల్లడించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుందని.. దీన్ని అడ్డుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు చరిత్రహీనులుగా మిగలొద్దని హితవు పలికారు.

ఉత్తారాంధ్రవాసులను రెచ్చగొట్టేలా అమరావతి రైతుల ప్రవర్తన : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నది సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమైతే.. కొన్ని ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందాలన్నది చంద్రబాబునాయుడు ధ్యేయం అని మంత్రి అమర్నాథ్​ పేర్కొన్నారు. రాష్ట్రంలో అందరూ బాగుపడాలని ఉత్తరాంధ్ర వాసులు చూస్తుంటే.. తామే బాగుపడాలని అమరావతి ప్రాంతీయులు అంటున్నారని తెలిపారు. ఉత్తరాంధ్రవాసులను రెచ్చగొట్టేలా అమరావతి రైతులు వ్యవహరించడం తగదన్నారు.

జేఏసీకి పూర్తి మద్దతు : విశాఖనే పరిపాలన రాజధాని అయి తీరుతుందని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు. విశాఖ రాజధాని ఏర్పాటు కోసం జేఏసీ చేపట్టే కార్యాచరణకు తమ వంతు సహకారం ఉంటుందని వెల్లడించారు. ప్రభుత్వ విప్, అనకాపల్లి జిల్లా వైకాపా అధ్యక్షులు కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సోషల్ జస్టిస్ అడ్వైజర్ జూపూడి ప్రభాకర్ రావు, వ్యాపార, వాణిజ్య, ఉపాధ్యాయ , మేధావి, కార్మిక, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.