ETV Bharat / state

Fire accident: ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన కార్మికులు - అనకాపల్లి జిల్లా తాజా వార్తలు

Fire accident: జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మసిటీలోని అలివిర ల్యాబ్స్‌లో రియాక్టర్ ట్యాంక్ పేలి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం అనకాపల్లి జిల్లాలో జరిగింది.

Fire accident
జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మసిటీలో అగ్నిప్రమాదం
author img

By

Published : May 8, 2022, 11:57 AM IST

జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మసిటీలో అగ్నిప్రమాదం

Fire accident: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని రాంకీ ఎస్‌ఈజెడ్‌ జోన్‌లోని అలివిర యానిమల్‌ హెల్త్‌ లిమిటెడ్‌ ఫార్మాకంపెనీలో శనివారం రాత్రి 7గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగి దట్టమైన పొగలు రావడంతో ఉద్యోగులు, కార్మికులు భయాందోళనతో పరుగులు తీశారు. పొగ, దుర్వాసన చుట్టు పక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ కంపెనీలో ఫెన్‌బెన్‌జోల్‌ ఔషధం ఉత్పత్తి తయారు చేస్తున్నారు. మాడ్యుల్‌ 1,2 (ప్రొడక్షన్‌ బ్లాక్‌)లో ఔషధ ఉత్పత్తుల తయారీలో భాగంగా రియాక్టర్‌ నుంచి టోలిన్‌ సాల్వెంట్‌ను పైపులైను నుంచి బయటకు(అన్‌లోడ్‌) తీస్తుండగా రసాయనిక చర్య జరిగి మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న లారస్‌, రాంకీ, అచ్యుతాపురం, అనకాపల్లి, ఎన్టీపీసీ అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. మంటల వేడి కారణంగా బ్లాక్‌ లోపలికి ఎవరూ వెళ్లలేని పరిస్థితి. రాత్రి 10గంటలు దాటిన తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఉద్యోగులు, కార్మికులు సుమారు 130 మందిని గేటు లోపలే ఉంచి లెక్కించారు. అగ్నికీలలు వ్యాపించిన వెంటనే కంపెనీలో విద్యుత్తు సరఫరాను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని కార్మిక వర్గాలు చెబుతున్నాయి.

ప్రమాద స్థలిని పరవాడ సీఐ ఈశ్వరరావు, తహసీల్దారు బి.వి.రాణి పరిశీలించారు. యాజమాన్యంతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాద తీవ్రతకు బ్లాక్‌లోని పైపులు, కేబుల్స్‌, ఇన్సులేటర్లు కాలిపోయాయి. విద్యుత్తు లేకపోవడంతో చీకట్లోనే అగిమాపక సిబ్బంది ఫోమ్‌, నీటితో మంటలార్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ప్రమాదంలో ఎవరికైనా.. ఏమైనా అయిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.