ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని.. రాష్ట్రంలో సైకో పాలన నడుస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. అనకాపల్లి పర్యటనలో ఉన్న చంద్రబాబు స్థానికంగా ఉన్న కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ నిర్వహించిన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. పార్టీ కార్యకర్తలే తెదేపాకు అండ అని.. క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మూడేళ్ల జగన్ రివర్స్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందన్నారు.
‘‘డ్రైవింగ్ రాని వారిని సీట్లో కూర్చోబెడితే వెనక్కి తీసుకెళ్తారు. పన్నులు, ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రజలపై భారం మోపుతున్నారు. దుర్మార్గపు పాలన నశించాలి.. రివర్స్ పాలన పోవాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ప్రజా వ్యతిరేక పాలనపై ప్రతి ఇంటి నుంచి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులు, పోలీసులకు సమస్యలు వస్తే మాట్లాడేది తెదేపానే. ఆ విషయాన్ని వారు గుర్తుంచుకోవాలి. అందరి లెక్కలు రాస్తున్నాం.. వేధింపులకు తిరిగి చెల్లిస్తాం . - చంద్రబాబు,తెదేపా అధినేత
ఇదీ చదవండి: