ETV Bharat / state

కాబోయే భర్తకు సర్ ప్రైజ్ అంటూ కళ్లకు గంతలు కట్టింది.. కత్తితో గొంతు కోసి పరారైంది! - bride attack on groom

వారిద్దరికీ నిశ్చితార్థమైపోయింది.. ఇక మిగిలింది పెళ్లే. మే నెలలో ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే సరదాగా షికారు చేయడానికి బైక్ పై బయలుదేరారు. కాసేపు అలా తిరిగి.. ఆ తర్వాత షాపింగ్ కూడా చేశారు. అనంతరం ఓ బాబా ఆశ్రమం పరిసరాల్లో ఆగారు. అక్కడ సరాదాగా కళ్లకు గంతలు ఆట ఆడేందుకు సిద్ధమయ్యారు. కాబోయే భర్త రెడీ అన్నాడు. కళ్లకు గంతలు కట్టింది కాబోయే భార్య. ఆ వెంటనే కత్తితో అతని గొంతు కోసింది. ఈ ఘటన అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం కొమళ్ల పూడి వద్ద చోటు చేసుకుంది.

attempt murder
attempt murder
author img

By

Published : Apr 18, 2022, 9:12 PM IST

Updated : Apr 19, 2022, 5:59 PM IST

అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం కొమళ్లపూడి వద్ద... ఓ యువతి కాబోయే వరుడిపై హత్యాయత్నం చేసిన ఘటన సంచలనం రేపింది. యువతి దాడిలో తీవ్రంగా గాయపడ్డ యువకుడు అనకాపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మే నెలలో ఒక్కటవ్వాల్సిన ఈ జంట విషయంలో... అనూహ్యంగా చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది.

మాడుగుల మండలం ఘాట్‌రోడ్డుకు చెందిన అద్దేపల్లి రామానాయుడుకు, రావికమతంకు చెందిన వియ్యపు పుష్పకు... వివాహ నిశ్చితార్థం జరిగింది. వచ్చే నెల 20న పెళ్లి జరగాల్సి ఉంది. వీరిద్దరూ సోమవారం ద్విచక్రవాహనంపై వెళ్లి.. వడ్డాదిలో షాపింగ్‌ చేశారు. కొమళ్లపూడి శివారు బాబా ఆశ్రమం వద్ద సరదాగా గడిపేందుకు ఆగారు. యువకుడి కళ్లకు గంతలు కట్టి దాగుడుమూతలు ఆడుతున్నట్లు నటించిన యువతి... ఉన్నట్లుండి ఒక్కసారిగా అతడి గొంతుపై కత్తితో దాడి చేసింది. తానే ద్విచక్రవాహనంపై యువకుడిని రావికమతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చింది. ఏదో గుచ్చుకుని గాయమైందని వైద్య సిబ్బందికి చెప్పి వెళ్లిపోయింది. యువకుడికి ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు... పరిస్థితి విషమంగా ఉండటంతో అనకాపల్లి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

కాబోయే భర్తకు సర్ ప్రైజ్ అంటూ కళ్లకు గంతలు కట్టింది.. కత్తితో గొంతు కోసి పరారైంది!

విహహం ఇష్టం లేకపోయినందువల్లే దాడికి పాల్పడినట్లు... దాడి తర్వాత యువతి తనతో చెప్పిందని యువకుడు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

నిలకడగా ఆరోగ్యం: యువతి చేతిలో కత్తిపోటుకు గురైన యువకుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం ఘాట్‌ రోడ్డుకి చెందిన రాము నాయుడు, రావికమతానికి చెందిన పుష్పకి వచ్చే నెల 20న వివాహం జరగాల్సి ఉంది. వీరిద్దరూ నిన్న కోమల్లపూడిలోని జ్యోతిర్మయి బాబా దివ్య క్షేత్రానికి వెళ్లారు. అక్కడ రామునాయుడిని కళ్లు మూసుకోమని చెప్పి.... కత్తితో పుష్ప అతని గొంతు భాగంలో కోయటంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను అనకాపల్లి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి... రాము గొంతు కోసుకుని తన కుమార్తె పేరు చెబుతున్నాడని పుష్పతల్లి ఆరోపించింది. దీనిపై స్పందించిన రాము.... సంఘటనా స్థలంలో తనతో పాటు పుష్ప మాత్రమే ఉందని... అక్కడేం జరిగిందో పుష్పతల్లికి ఎలా తెలుస్తుందన్నారు.

ఇదీ చదవండి: ఏపీ స్పిన్నింగ్ మిల్స్ అధ్యక్షుడు హఠాన్మరణం.. వాకింగ్​ చేస్తూనే..!

Last Updated : Apr 19, 2022, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.