ETV Bharat / state

Army Jawan Died: రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి.. పెళ్లైన రెండు నెలలకే.. - indian army accident today news

Army Jawan Died: రోడ్డు ప్రమాదంలో అనకాపల్లి జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ దుర్మరణం చెందారు. పెళ్లై రెండు నెలలు గడవక ముందే ఆయన మృతి చెందడంతో కుటుంబమంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు గుంటూరు జిల్లాలో పిడుగుపాటుకు గురై ఓ మహిళ మృతి చెందింది.

Army Jawan Died
రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి
author img

By

Published : May 6, 2023, 3:00 PM IST

Army Jawan Died: అనకాపల్లి జిల్లాలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని చీడికాడ మండలంలోని దిబ్బపాలెం గ్రామానికి చెందిన ఓ ఆర్మీ జవాన్.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని దిబ్బపాలెం గ్రామానికి చెందిన మధుమంతి మహేశ్ అనే వ్యక్తి ఆర్మీ జవాన్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం పంజాబ్​లో విధులు నిర్వహిస్తున్న ఆయన.. డ్యూటీలో భాగంగా తోటి ఆర్మీ ఉద్యోగులతో కలిసి దిల్లీ వెళ్లారు. ఈ క్రమంలో ప్రత్యేక వాహనంలో తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ట్రాఫిక్ అధికంగా ఉంది. దీంతో ఆయన వాహనం దిగి ట్రాఫిక్ క్లియర్ చేస్తుండగా.. అధిక వేగంతో ప్రయాణిస్తున్న ఓ బైక్ మహేశ్​ను ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన మహేశ్​ను తోటి ఆర్మీ ఉగ్యోగులు సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. మహేశ్ మృతి చెందిన సమాచారాన్ని ఆర్మీ ఉన్నత అధికారులు.. ఆయన కుటుంబ సభ్యులకు అందించారు.

కాగా.. మహేశ్​కు ఇటీవలే వివాహమైంది. మాకవరపాలెం మండలానికి చెందిన యువతితో ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదిన వివాహం జరిగింది. వివాహమైన తర్వాత నెల రోజుల పాటు మహేశ్ గ్రామంలోనే ఉన్నారు. సెలవుల అనంతరం ఇటీవలే మహేశ్ రక్షణ రంగంలో విధి నిర్వహణకు వెళ్లారు. వివాహమై రెండు నెలలు కాకుండానే మహేశ్​ను బైక్​ రూపంలో మృత్యువు కబళించింది. పారాణి ఆరకముందే ఆ ఇంటి దీపం ఆరిపోయింది. మహేశ్ మృతితో ఆయన భార్య, తల్లి కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో ఆ గ్రామమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదివారం మధ్యాహ్నం మహేశ్​ పార్థివ దేహం ఆయన గ్రామానికి చేరే అవకాశం ఉంది.

పిడుగుపాటుకు మహిళ మృతి.. గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం మండల కేంద్రంలో పిడుగుపాటుకు గురై శనివారం ఓ పశువుల కాపరి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెరికల జోజప్ప భార్య జ్యోతి(45) గేదెలు కాచేందుకు శుక్రవారం గ్రామ పరిధిలోని పొలానికి వెళ్లింది. అయితే మధ్యాహ్నం సమయంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పశువులను మేతకు తీసుకువచ్చిన వారందరూ పొలం సమీపంలోని ఓ చెట్టు వద్దకు చేరుకున్నారు.

అదే సమయంలో వారికి కొద్ది దూరంలో పిడుగు పడింది. దీంతో సమీపంలో ఉన్న జ్యోతి పిడుగుపాటుకు స్పృహతప్పి పడిపోయింది. మరో ముగ్గురు వ్యక్తులు కూడా కింద పడిపోగా.. వారు స్వల్ప గాయాలతో ఈ ప్రమాదంలో నుంచి బయటపడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న జ్యోతిని స్థానికులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున జ్యోతి మృతి చెందిందని వైద్యులు తెలిపారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతురాలికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

శ్రీశైలం రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు.. మరోవైపు శ్రీశైలం ఘాట్ రోడ్డు వద్ద యాక్సిడెంట్ జరిగింది. శిఖరం సమీపంలోని దెయ్యాల మలుపు వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను సున్నిపెంట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జిల్లాలోని తండ్రుగుండ మండలం మద్దుకూరు గ్రామానికి చెందిన 80 మంది రెండు ప్రైవేటు బస్సుల్లో శ్రీశైలం వస్తుండగా ప్రమాదం జరిగింది.

కూలిన ఇల్లు.. సాయం కోరుతూ ప్రభుత్వానికి వేడుకోలు.. నంద్యాల జిల్లాలోని పొన్నాపురంలో ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన ఓ కుటుంబం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇల్లు కూలింది. బాధితుడు మాబాష అనే వ్యక్తి ఇంట్లో పెద్ద శబ్దం వచ్చి మంటలు ఒక్కసారిగా ఎగిసిపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ పేలుడు దాటికి ఇల్లు కూలిపోయింది. ఈ ప్రమాదానికి గ్యాస్, షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని బాధితుడు తెలిపాడు. ఈ ఘటనలో తన ఇంటితో పాటు విలువైన వస్తువులు కూడా కాలిపోయాయని బాధితుడు తెలిపాడు. తమను ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.