ETV Bharat / state

Agricultural Research Centres: వ్యవసాయ పరిశోధన కేంద్రాలపై వైసీపీ సర్కార్ నిర్లక్ష్య వైఖరి.. పంటల సాగుపై తీవ్ర ప్రభావం - agriculture labs in ap

Agricultural Research Centres: రైతుల కష్టాలు కళ్లారా చూశానని, వ్యవసాయం దండగ కాదు.. పండగని నిరూపిస్తానంటూ.. పాదయాత్రలో అన్నదాతలపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోసిన జగన్.. అధికారంలోకి రాగానే వారి నడ్డి విరిచారు. వ్యవసాయానికి వెన్నుదన్నుగా ఉండాల్సిన పరిశోధన కేంద్రాలను గాలికొదిలేశారు. నిధులు విడుదల చేయకుండా శాస్త్రవేత్తల పోస్టులు భర్తీ చేయకుండా వాటిని నిర్వీర్యం చేశారు. రాష్ట్ర స్థాయిలో చెరకు, జాతీయ స్థాయిలో బెల్లంపై పరిశోధనలతో గుర్తింపు పొందిన అనకాపల్లి ప్రాంతీయ పరిశోధన కేంద్రంలో నేడు ఆశించిన స్థాయిలో ఆవిష్కరణలు జరగడం లేదు.

Agricultural_Research_Centres
Agricultural_Research_Centres
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 12, 2023, 7:23 AM IST

Updated : Sep 12, 2023, 8:26 AM IST

Agricultural Research Centres: వ్యవసాయ పరిశోధన కేంద్రాలపై వైసీపీ సర్కార్ నిర్లక్ష్య వైఖరి.. పంటల సాగుపై తీవ్ర ప్రభావం

Agricultural Research Centres: రైతులు ఆర్థికంగా బలపడాలంటే సరైన విత్తనం అవసరం. పంటలకు పురుగులు, తెగుళ్లు సోకితే వాటిని సకాలంలో నివారించే యాజమాన్య విధానాలు రూపొందించాలి. దీనికి వ్యవసాయ పరిశోధన కేంద్రాలు ఎంతో దోహదపడతాయి. రాష్ట్ర విభజన తర్వాత ప్రధానమైన పరిశోధన కేంద్రాలు తెలంగాణలో ఉండిపోయాయి. దీంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని పరిశోధన కేంద్రాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకున్నారు.

No Reserch in Agriculture Labs: అనకాపల్లి ఆర్ఏఆర్ఎస్​కు స్వయంగా వచ్చి సమీక్ష నిర్వహించారు. పరిశోధన కేంద్రాలలో ప్రధానమైన అనకాపల్లి కేంద్రానికి భారీగా నిధులు మంజూరు చేశారు. ఖాళీ పోస్టులు భర్తీ చేశారు. అనకాపల్లి కేంద్రానికి దాదాపు 6 కోట్ల రూపాయలు, ఎలమంచిలి పరిశోధన క్షేత్రానికి కోటి 75 లక్షల రూపాయలు కేటాయించారు. ఆ నిధులతో ప్రయోగశాలలు, రైతు శిక్షణ కేంద్రాల నిర్మాణం చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంతా తారుమారైంది. నిధులు నిలిపేసి, శాస్త్రవేత్తలను బదిలీల పేరుతో ఇక్కడి నుంచి తరలించడంతో పరిశోధనలపై ప్రభావం పడింది.

ఏరువాక కేంద్రాలు తరలించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు.. ఆవేదనలో రైతులు

Research Centres in AP: వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన అనకాపల్లి పరిశోధన కేంద్రంలో.. ప్రయోగశాలలు శిథిల భవనాల్లో, ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్నారు. అన్ని పరిశోధనలు ఒకే చోట నిర్వహించేలా టీడీపీ ప్రభుత్వ హయాంలో 3కోట్ల 47లక్షల రూపాయలు భవన సముదాయ నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వం మారి నిధులు రాకపోవడంతో గుత్తేదారు గోడల స్థాయిలోనే పనులు నిలిపేశారు. 2కోట్ల 32లక్షల రూపాయలతో చేపట్టిన రైతు శిక్షణ భవన నిర్మాణమూ పునాదుల స్థాయిలోనే నిలిచిపోయింది.

Agriculture Labs in AP: ఎలమంచిలి మండలం కొక్కిరాపల్లిలో నువ్వుల పరిశోధన కేంద్రంలో వేరుసెనగపైనా పరిశోధనలు చేపట్టేలా టీడీపీ ప్రభుత్వం ఇద్దరు శాస్త్రవేత్తలను అదనంగా నియమించింది. విత్తన నిల్వకు 75 లక్షల రూపాయలతో గోదాం, రైతుల శిక్షణకు కోటి రూపాయలుతో భవనం మంజూరు చేసినా.. వైసీపీ సర్కారు నిధులు విడుదల చేయకపోవడంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన అనకాపల్లి పరిశోధన కేంద్రంలో పనిచేసే శాస్త్రవేత్తలను బదిలీ చేస్తున్న ప్రభుత్వం కొత్త వారిని నియమించడం లేదు.

నెల్లూరులో యూరియా కృత్రిమ కొరత.. ఇబ్బందుల్లో రైతులు

No Reserch in Research Centres: గతంలో ఆర్ఏఆర్ఎస్​లో 25 మంది శాస్త్రవేత్తలు పనిచేసేవారు. ఇప్పుడు 16 మందే ఉన్నారు. దీంతో ఆయా విభాగాల్లో పరిశోధనలు సాగకపోవడంతో పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడుతోంది. చెరకు పంటను పట్టి పీడిస్తున్న పసుపు ఆకు తెగులుపై పరిశోధనలు చేస్తున్న కీలక శాస్త్రవేత్తను బదిలీ చేశారు. ఆ స్థానంలో ఎవరినీ నియమించలేదు. ఈ విభాగంలో నలుగురు శాస్త్రవేత్తలకు ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. పసుపు ఆకు తెగులు వల్ల చెరకు దిగుబడులు 40 శాతం పడిపోయాయి.

AP Agriculture Labs: ఫలితంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో సాగు విస్తీర్ణం లక్ష ఎకరాల నుంచి 28 వేల ఎకరాలకు తగ్గింది. కీలకమైన జన్యు విభాగంలోనూ ఇద్దరే ఉన్నారు. భూసారం, కీటక విభాగం, సేద్య విభాగాల్లో పనిచేసే శాస్త్రవేత్తలను బదిలీ చేయడంతో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. బెల్లం విభాగంలోని ప్రధాన శాస్త్రవేత్త జగన్నాధరావును ఏడీఆర్​గా నియమించడంతో ఆయనే రెండు పోస్టులనూ చూసుకుంటున్నారు. కొక్కిరాపల్లి పరిశోధన కేంద్రంలో నలుగురు శాస్త్రవేత్తలకు ఇద్దరే మిగిలారు.

HOME MINISTER: 'అన్ని నియోజకవర్గాల్లో వ్యవసాయ పరీక్షా కేంద్రాలు'

Farmers Protest in AP: పరిశోధనలను రైతుల వద్దకు తీసుకువెళ్లేందుకు ఏరువాక కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రాలు పనిచేస్తాయి. టీడీపీ ప్రభుత్వం బుచ్చెయ్యపేటలో కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నో ఏళ్లుగా జిల్లాలోని రైతులకు సేవలందిస్తున్న అనకాపల్లి ఏరువాక కేంద్రాన్ని అమలాపురం తరలించి స్థానిక రైతులను కష్టాల్లోకి నెట్టేసింది. పట్టణం నడిబొడ్డునున్న పరిశోధన కేంద్రానికి చెందిన భూముల్లో 50 ఎకరాలను ఇదివరకు వైద్య కళాశాల కోసం వైసీపీ ప్రభుత్వం కేటాయించింది.

Agricultural Research Centres: పరిశోధనల కోసం వినియోగించే భూములను వైద్య కళాశాలకు కేటాయిస్తే రైతులకు వాటి ఫలాలు ఎలా అందుతాయని స్థానికులు కొందరు న్యాయస్థానానికి వెళ్లి అడ్డుకోవడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. లేదంటే విలువైన ఈ భూములను సైతం జగన్‌ ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించేసేది.

Last Updated : Sep 12, 2023, 8:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.