DOLI: పాముకాటుతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని.. డోలీలో 6 కిలోమీటర్ల దూరం మోసుకొళ్లిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. పాడేరు మండలం మారుమూల సలుగు పంచాయతీ దబ్బగరువులో ఓ వ్యక్తి పాము కాటుకు గురయ్యాడు. ఆసుపత్రికి తీసుకు వెళ్లాలంటే 6 కిలోమీటర్ల వరకు రహదారి లేకపోవడంతో.. అంబులెన్స్ వచ్చే అవకాశమే లేదు. దీంతో స్థానిక యువకులు డోలీ కట్టి.. సెల్ ఫోన్లైట్ల సహాయంతో కొండపై నుంచి అతి కష్టం మీద బాధితున్ని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఏళ్లు గడుస్తున్నా.. తమ గ్రామాలకు రహదారి సౌకర్యం లేక.. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ కూడా రావడంలేదంటూ గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. బాహ్య ప్రపంచం రావాలంటేనే కొండ మార్గం గుండా గంటల తరబడి నడవాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి సదుపాయం కల్పించాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: