ETV Bharat / state

విహారయాత్రలో విషాదం.. లారీ లోయలో పడి ఇద్దరు మృతి - అల్లూరి జిల్లాలో ప్రమాదం

Lorry Fell into the Valley: వారంతా సంతోషంగా సమయం గడుపుదామని విహారయాత్రకు వచ్చారు. సరదాగా లారీ ఎక్కారు. కానీ ఘాట్ రోడ్లో ఆ లారీ ప్రమాదానికి గురై ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందడంతో.. వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన అల్లూరి జిల్లాలో జరిగింది.

Lorry Fell into the Valley
లోయలో పడిన లారీ
author img

By

Published : Feb 3, 2023, 4:55 PM IST

Lorry Fell into the Valley: ఎంతో ఉల్లాసంగా సాగుతున్న వారి ప్రయాణానికి.. ఆ ఘాట్ రోడ్​లో బ్రేక్ పడింది. విహారయాత్ర విషాదయాత్రగా మారింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం పాములేరు సమీపంలోని.. ఘాట్ రోడ్​లో లారీ లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నారాయణరెడ్డి, సురేష్ అనే ఇద్దరు పర్యటకులు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

చింతూరులోని జలతరంగని జలపాతం తిలకించి రాజమహేంద్రవరం వెళ్లేందుకు లారీ ఎక్కారు. మారేడుమిల్లి ఘాట్ రోడ్​లో లారీ లోయలోకి దూసుకుపోవడంతో.. ప్రమాదం జరిగింది. పర్యాటకులు ఒంగోలు జిల్లా దర్శి ప్రాంతానికి చెందినవారుగా గుర్తించారు. సరదా కోసం వచ్చినవారు ఇలా మరణించడంతో.. విహారయాత్ర విషాదంగా మారింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.