Telangana ENC letter on Polavaram:పోలవరం ప్రాజెక్టు ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలానికి బ్యాక్‌వాటర్ ముప్పు ఉందని తెలంగాణ ఈఎన్‌సీ తెలిపింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి లేఖ రాసింది. బ్యాక్‌వాటర్‌పై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని కోరింది. బ్యాక్‌వాటర్ ప్రభావంపై స్వతంత్ర సంస్థతో అధ్యయనం చేయించాలని ఈఎన్‌సీ లేఖలో పేర్కొంది.ఎఫ్ఆర్ఎల్ వద్ద నీటినిల్వ ఉంటే ముంపు ఎక్కువ ఉంటుందని లేఖలో వివరించింది. ముర్రేడువాగు, కిన్నెరసాని నదుల పరిసరాలు మునుగుతాయని ఈఎన్‌సీ తెలిపింది. రక్షణ కట్టడాలు నిర్మించి నివారణ చర్యలు చేపట్టాలని లేఖలో కోరింది. బ్యాక్‌వాటర్‌తో ఏర్పడే ముంపును నివారించాలని తెలంగాణ ఈఎన్‌సీ విజ్ఞప్తి చేసింది. నష్ట నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా వివరించింది.
ఇవీ చదవండి: మృత్య్సకారుల మధ్య మళ్లీ మొదలైన వివాదం.. భారీగా మోహరించిన పోలీసులు