ETV Bharat / state

Smuggling: 'పుష్ప' ఫాలో అవుతున్న స్మగ్లర్లు... అలా దాచి..! - పుష్పా సినిమా తరహా స్మగ్లింగ్​

Smuggling: అటవీ సంపదను అధికారులు కన్నులు గప్పి సొమ్ము చేసుకుంటారు. కూలీల సాయంతో చాకచక్యంగా దాచిపెట్టి.. మార్కెట్ ఉన్నప్పుడు తరలించి లక్షల రూపాయల వ్యాపారం చేసే స్మగ్లింగ్.. ఈ కథ ఎక్కడో విన్నట్లుంది కదు..!అదే పుష్ప సినిమా... ప్రస్తుతం కొందరు అక్రమార్కులు ఆ సినిమానే ఫాలో అవుతున్నారు. అయితే ఇక్కడ స్మగ్లర్లు సరుకును ఏ నీటిలోనో, బావిలోనో దాయలేదు. ఏకంగా భూమిలోనే దాచి అధికారుల కళ్లుగప్పి అక్రమ దందా సాగిస్తున్నారు. ఇంతకీ ఇదంతా ఎక్కడంటే..?

Smuggling
స్మగ్లింగ్
author img

By

Published : Jul 22, 2022, 12:07 PM IST

Smuggling: అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం లక్ష్మీదేవిపేట శివారులో భూమిలోపల అక్రమంగా నిల్వ ఉంచిన 30 టేకు దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటవీశాఖ బీట్‌ అధికారి మూర్తి... మరికొందరు సిబ్బందితో కలిసి గురువారం తనిఖీలు చేపట్టగా ఈ టేకు దుంగలు దొరికాయి. తనిఖీల విషయం తెలుసుకున్న మండలంలోని రాజపేటకు చెందిన వైకాపా నాయకులు మూర్తిపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. ఈ సంఘటనపై చింతూరు డీఎఫ్‌వో సాయిబాబును వివరణ కోరగా... దాడి వాస్తవమేనని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.