ETV Bharat / state

AOB: 700 మంది మావోయిస్టు సానుభూతిపరులు లొంగుబాటు

Maoist sympathizers: ఏవోబీ ప్రాంతంలో సుమారు 700 మంది మావోయిస్టు సానుభూతి పరులు లొంగిపోయారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఇంత మంది లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆ ప్రాంతంలో మావోలకు పెద్ద దెబ్బతగిలిందనే చెప్పాలి.

Maoist sympathizers
మావోయిస్టులు
author img

By

Published : Sep 17, 2022, 8:37 PM IST

Surrender of 700 Maoist sympathizers : ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని బోండా ఘాట్​లో శనివారం దాదాపు 700 మంది మావోయిస్టు సానుభూతి పరులు లొంగిపోయారు. పోలీసులు నేడు ఆంధ్రహల్ గ్రామ సమీపంలో గల 65 బీఎస్ఎఫ్ బెటాలియన్ శిబిరం వద్ద సానుభూతిపరుల లొంగుబాటు కార్యక్రమం ఏర్పాటు చేశారు. కోరాపుట్ పోలీస్ డీఐజీ రాజేష్ పండిట్, బీఎస్ఎఫ్ డీఐజీ మదన లాల్ తదితరులు సమక్షంలో వివిధ గ్రామాల ప్రజలు లొంగిపోయారు. ఈ లొంగుబాటులో ఒడిశా కోరాపుట్, మల్కన్‌గిరి జిల్లాతో పాటుగా.. అల్లూరి జిల్లా రంగబయలు పంచాయతీకి చెందిన పట్న పడాల్పుట్, కోసంపుట్ గ్రామాలకు చెందిన వారుసైతం ఉన్నారు. మొత్తం 700 మంది లొంగిపోగా అందులో 13 మంది రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు.

మారుమూలప్రాంతాల్లో అభివృద్ధికి పోలీసులతో కలిసి పని చేస్తామని వారంతా హామీ ఇచ్చారు. అనంతరం పోలీసులు గిరిజనులకు పలు సామగ్రి పంపిణీ చేశారు. భారీ స్థాయిలో సానుభూతిపరులు లొంగిపోవడంతో ఈ ప్రాంతంలో మావోయిస్ట్​లపై తీవ్ర ప్రభావం చూపనుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.