Roja Dimsa Dance: అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ఏరియాలో మంత్రి రోజా పర్యటించారు. లంబసింగి వద్ద మూడు కోట్లతో నిర్మిస్తున్న హరిత రిజల్ట్స్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, జడ్పీటీసీ చైర్పర్సన్ సుభద్రతో కలిసి డ్యాన్స్ చేశారు. ఏజెన్సీ సంప్రదాయమైన దింసా నృత్యానికి అనుకూలంగా స్టెప్పులు వేస్తూ చూపరులను కనువిందు చేశారు.
ప్రస్తుతానికి హరిత రిసార్ట్స్ 60% మాత్రమే పనులు అయ్యాయి. మిగిలిన పనులు జరగాల్సి ఉంది. మారుమూల అల్లూరి జిల్లాలో పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్నందున.. తమ సంస్థ తరఫున హరిత రిసార్ట్స్ నిర్మాణం పర్యాటకులకు ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి రోజా ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: