Police seized ganja: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జీకే వీది మండలం దారకొండ గ్రామంలో పోలీసులు భారీగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ శివ కిశోర్ తన కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి తెలిపారు. ఈ నెల 21న, సీలేరు పోలీసులకు అందిన సమాచారం మేరకు దారకొండ గ్రామం, మాయాబజార్ జంక్షన్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 633 కిలోల గంజాయిని.. తరలిస్తున్న ముఠాను సీలేరు పోలీసులు పట్టుకోవడం జరిగిందని.. ఏఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అన్నారు.
ఈ కేసులో మొత్తం 12 మంది ముద్దాయిలున్నారని.. వీరిలో ఐదుగురు ముఖ్యమైన వారిని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఈ గంజాయిని ఒడిస్సా, బంధ వీధి తదితర ప్రాంతాల నుంచి ఒక వ్యక్తి ద్వారా కొని.. ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసే వ్యక్తి దగ్గర ముందుగా కొంత నగదు తీసుకుని గంజాయిని నర్సీపట్నం మీదుగా తుని దగ్గర అప్పగించే ప్రయత్నంలో వాళ్లని పట్టుకోవడం జరిగిందని తెలిపారు. వారి వద్ద నుంచి రూ 2.55 లక్షలు, రెండు వాహనాలను, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీళ్లు ఈ గంజాయిని ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తికి సరఫరా చేస్తున్నారని.. త్వరలోనే అతడిని పట్టుకుంటామని అన్నారు.
పట్టుబడిన గంజాయి ముఠాలో ముఖ్యమైన వారు జీకే వీధి మండలంలోని మాలిగూడ గ్రామానికి చెందిన కొర్ర లైకోన్ (30)డ్రైవర్. ఇతను ప్రభుత్వ వసతి గృహాలకు కూరగాయలు సరఫరా చేస్తాడు. ఆ ముసుగులోనే వేరే వ్యక్తులకు గంజాయి తరలిస్తున్నాడు. దుప్పులవాడ పంచాయతీ, కోరాపల్లి గ్రామం చెందిన గంపరాయి నారాయణ (33)..ఇతను గంజాయి రైతు దగ్గర కొనడం వాహనాలకు ఎక్కించి తరలించడం చేస్తుంటాడు. ఈ ఇద్దరూ కలిసి ఈ వ్యాపారం చేస్తున్నారు. వీరికి సహకారంగా రింతాడ పంచాయతీ ముల్లమెట్ట గ్రామానికి చెందిన సాగిన గోపాలకృష్ణ (28). దామనాపల్లి పంచాయితీ దొడ్డికొండ గ్రామానికి చెందిన కొర్ర మోహనరావు(29) వీరంతా జీకే వీధి మండలానికి చెందినవారని ఏఎస్పీ తెలిపారు. జి మాడుగుల మండలం కూడాపల్లి పంచాయతీ గన్నేరు పుట్టు గ్రామానికి చెందిన కిలో మధు(25). వీళ్లంతా అతని అనుచరులుగా ఉంటున్నారని తెలిపారు.
సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ గంజాయి తరలించడం వంటివి చేస్తున్నారు. ఒక్కసారి దొరికితే ఇప్పటి వరకూ సంపాదించిందంతా పోతుంది. గతంలో గంజాయి పండించిన వారి మీద కేసు పెట్టడం జరిగింది.. ఎవరైనా గంజాయి రవాణా చేస్తారో గంజా యాక్ట్ ప్రకారం వారి ఆస్తులను జప్తు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న ఆస్తులన్నీ జప్తు చేస్తాము. పాత కేసులు ఉన్న వారు ఇలాంటివి మరలా చేస్తే వారి ఆస్తులన్నీ జప్తు చేయడం జరుగుతుంది.- ప్రతాప్ శివకిశోర్, ఏఎస్పీ చింతపల్లి
ఇవీ చదవండి: