ETV Bharat / state

గిరిజన హస్టల్లో చదువుతున్న బాలిక ప్రసవం - సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ దారుణమన్న స్థానికులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2023, 3:36 PM IST

Minor Student Delivers Baby in Hukumpeta: గిరిజన బాలికల వసతి గృహ మైనర్ విద్యార్థిని బిడ్డను ప్రసవించింది. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగానే ఉన్నారని పాడేరు జిల్లా ఆసుపత్రి వైద్య సిబ్బంది తెలిపారు. అయితే బాలిక గర్భం దాల్చి నెలలు నిండేంత వరకు పర్యవేక్షకులకు, అధికారులకు విషయం తెలియకపోవడం గమనార్హం.

Minor_Student_Delivers_Baby_in_Hukumpeta

Minor Student Delivers Baby in Hukumpeta : గిరిజన బాలికల వసతి గృహ విద్యార్థిని (17) బిడ్డను ప్రసవించింది. ఈ ఉదంతం సంచలనం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే, అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట ఓ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుకుంటోంది. ఆ విద్యార్థిని గిరిజన బాలికల వసతి గృహంలో ఉంటోంది. గురువారం రాత్రి ఆమె కడుపు నొప్పిగా ఉందని చెప్పడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడకు వెళ్లాక ఆమె నిండు గర్భిణి అని వైద్యులు గుర్తించారు. అప్పటికే నెలలు నిండటంతో ఆసుపత్రిలోనే పాపకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డ బరువు తక్కువ ఉండటంతో తల్లీ బిడ్డలను మెరుగైన వైద్యం కోసం పాడేరు జిల్లా ఆసుపత్రిలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు.

16 Years Tribal Girl Delivers Baby in Alluri Sita Rama Raju District : డిగ్రీ చదివే యువకుడితో బాలికకు ఉన్న సన్నిహిత సంబంధం కారణంగానే గర్భం దాల్చినట్లు అనుమనం వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహ విద్యార్థిని గర్భం దాల్చి 9 నెలలు నిండేంత వరకు వసతి గృహ పర్యవేక్షకులకు, అధికారులకు విషయం తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అధికారులు ఈ విషయం వెలుగులోకి రానీయకుండా గుట్టుగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగానే ఉన్నారని పాడేరు జిల్లా ఆసుపత్రి వైద్య సిబ్బంది తెలిపారు.

12 ఏళ్లకే తల్లైన బాలిక.. బహిర్భూమికి వెళ్లగా ఏడు నెలల క్రితం అత్యాచారం

Woman Died After Lorry Collided With a Two Wheeler : ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, రామచంద్ర పురానికి చెందిన గుత్తుల కృష్ణ లక్ష్మీ దంపతులు తమ బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి తమ ద్విచక్ర వాహనంపై తమ స్వగృహానికి వస్తున్నారు. అదే సమయంలో బిక్కవోలు మండలం తొస్సిపూడిలోని సాయిరాం రైస్ మిల్లకు వద్దకు వచ్చేసరికి ఓ లారీ వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్​పై ఉన్న గుత్తుల లక్ష్మి(62) తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త కృష్ణకు గాయాలు అయ్యాయి. కృష్ణను 108 వాహనంపై అనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బిక్కవోలు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.

'మగ గొంతు వింటేనే భయపడేలా' మైనర్​పై అకృత్యాలు - పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయవాద దంపతుల దారుణం

Road Accident on Chennai-Kolkata National Highway : గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి వద్ద చెన్నై-కోల్​కతా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి విజయవాడ వైపునకు వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు డివైడర్​ను ఢీకొని బోల్తా కొట్టింది. ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలవ్వగా మరొకరికి స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న ఆత్కూరు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Sexual Harassment: విశాఖలో దారుణం.. మైనర్ బాలికపై లైంగిక వేధింపులు.. ఆపై బ్లాక్​మెయిల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.