ETV Bharat / state

Lingaiah Dora: బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో కలపడం దారుణం: జాతీయ ఆదివాసీ జేఏసీ - Lingaiah Dora latest coments

Do Not Include Boya and Valmiki In ST List: బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ ఆదివాసీ అఖిలపక్ష జేఏసీ అధ్యక్షుడు లింగయ్య దొర స్పందించారు. ఆదివాసీలను ఓట్ల కోసమే రాజకీయ నేతలు వాడుకుంటున్నారే తప్ప, వారి సంక్షేమ ప్రయోజనాలు పట్టించుకోవడం లేదని ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Apr 16, 2023, 2:17 PM IST

Updated : Apr 16, 2023, 5:44 PM IST

Do Not Include Boya and Valmiki In ST List : బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో కలుపుతూ రాష్ట్ర ప్రభత్వం తీసుకున్న తీర్మానం దారుణమని మాజీ ఎమ్మెల్యే, జాతీయ ఆదివాసీ అఖిలపక్ష జేఏసీ అధ్యక్షుడు లింగయ్య దొర మండి పడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో లింగయ్య దొర పర్యటించారు. ఆదివాసీలను ఓట్ల కోసమే రాజకీయ నేతలు వాడుకుంటున్నారే తప్ప, వారి సంక్షేమ ప్రయోజనాలు పట్టించుకోవడం లేదని ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీలకు అతీతంగా పోరాటం.. జాతీయ స్థాయిలో ఉద్యమం : బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో కలపడం ఆదివాసీలకు తీరని నష్టమని లింగయ్య దొర అన్నారు. ఈ తీర్మానానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకమై పోరాటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో ఉద్యమానికి పిలుపు ఇస్తామని అన్నారు. తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుతో సంప్రదించి గిరిజన ప్రాంతాల్లో గిరిజనులే ఉద్యోగాలు చేసే జీవో తీసుకొచ్చామని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మౌనంగా ఉండడం వల్లనే జీవో నెంబర్ 3 లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

బోయ, వాల్మీకులను ఎస్టీల్లో కలపడం చట్ట ఉల్లంఘన : బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే రాజారావు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. గిరిజనులకు ఉపయోగపడే చట్టాలను మరిచి రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టాలు చేస్తున్నారని, అధిక సంఖ్యలో బోయ, వాల్మీకులను ఎస్టీల్లో కలపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది చట్ట ఉల్లంఘన అవుతుందని రాజారావు అన్నారు.

"మా ప్రాంతంలో ఉన్న వాళ్లకు 1917 బ్రిటీష్ ప్రభుత్వంలోనే ఒక సరిహద్దు పెట్టింది. మేము అడవిని నమ్ముకొని బతికే వాళ్లం కాబట్టి మాకు అన్యాయం జరగకూడదని ప్రత్యేక చట్టం తీసుకువచ్చారు. అల్లూరి సీతారామారాజు పోరాటంతో బ్రిటీష్ ప్రభుత్వం 5వ షెడ్యూల్​లో ఒక ప్రాంతం ప్రకటించింది. తరువాత రాజ్యాంగం వచ్చింది. ప్రత్యేక చట్టాలు చేశారు. ఇన్ని చట్టాలు ఉన్నా కూడా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఆదివాసీలను అడ్డం పెట్టుకోని ఓట్లు దండుకుంటున్నారే తప్ప ఆదివాసీల సంక్షేమం, వాళ్ల అభివృద్ధి, వనరులను కాపాడే పరిస్థితి లేదు.

ఇక్కడ ఉన్న వాళ్లకే దిక్కు లేదు. ఉన్న వాళ్లకే రక్షణ లేదు. అభివృద్ధి లేదు. సంస్కృతి, సంప్రదాయాలు మంట గలిసి పోతున్నాయి. వాళ్లను తీసుకువచ్చి మా నెత్తి మీద పెడితే, ఆదివాసీలు ఎటు పోవాలి. మా పరిస్థితి ఏంది? ఇది చాలా దారుణం. ఇష్టం వచ్చినప్పుడు, ఎన్నికల కోసం బీసీలను, ఓసీలను పట్టుకొచ్చి ట్రైబల్​లో కలపడం దారుణం. దీనిని ఆదివాసీ సంఘాలు, ఆదివాసీలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమం చేస్తున్నాం. " - లింగయ్య దొర, జాతీయ ఆదివాసీ అఖిలపక్ష జేఏసీ అధ్యక్షుడు

ఇవీ చదవండి

Last Updated : Apr 16, 2023, 5:44 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.