ETV Bharat / state

"కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... గిరిజనుల హక్కుల్ని కాలరాస్తున్నాయి"

Brinda Karat: కేంద్ర ప్రభుత్వం అడవుల నుంచి ఆదివాసీలను వెళ్లగొట్టేందుకు యత్నిస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్‌ ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల హక్కుల్ని కాలరాస్తున్నాయని మండిపడ్డారు. మాతృభాషా వాలంటీర్లను రెన్యువల్‌ చేయాలని కోరారు. గిరిజన ప్రాంతంలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కేంద్రం పాడేరులో శుక్రవారం గిరిజన సంఘం ఆధ్వర్యంలో బహిరంగ సభ ఆమె పాల్గొన్నారు.

Brinda Karat
బృందా కారత్‌
author img

By

Published : May 28, 2022, 9:13 AM IST

బృందా కారత్‌

Brinda Karat: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల హక్కుల్ని కాలరాస్తున్నాయని... సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్‌ విమర్శించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో జరిగిన.. సీపీఎం పార్టీ గిరిజన మహాసభలో ఆమె పాల్గొన్నారు. తలారిసింగి నుంచి పాతబస్టాండ్‌ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొని.. గిరిజనుల హక్కులు కాపాడాలంటూ నినాదాలు చేశారు. సీఎం జగన్‌.... పాదయాత్రలో గిరిజనులకు ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టేశారని బృందా కారత్ ఆక్షేపించారు. సరైన రహదారులు లేక... ఈ కాలంలోనూ గిరిజనులు డోలీలపైనే ఆధారపడటం దారుణమని మండిపడ్డారు. జీవో 3ను సుప్రీంకోర్టు రద్దు చేస్తే.... పోరాడాల్సిన జగన్‌ ప్రభుత్వం... ఎందుకు మౌనం వహిస్తోందని బృందా కారత్‌ ప్రశ్నంచారు. ఈ బహిరంగ సభ ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌, గిరిజన సంఘం నాయకులు, భాషా వాలంటీర్లు, రైతులు పాల్గొన్నారు.

"ఏపీలోని గిరిజనుల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయి. షెడ్యూల్ తెగల జాబితా నుంచి గిరిజనుల పేర్లను ఎందుకు తొలగిస్తున్నారు? వెనుకబడిన తెగల ప్రజలకు అంత్యోదయ కార్డులు ఎందుకు ఇవ్వడం లేదు।? గిరిజనుల గ్రామాలకు వెళ్లే రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. 2022లో కూడా.. అనారోగ్యంతో ఉన్నవారిని డోలీల్లో తీసుకొస్తున్నారు. ఇది చాలా సిగ్గుచేటు." - బృందా కారత్‌, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.