టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆస్ట్రేలియా వెళ్లిన శ్రీలంక ఆటగాడు ధనుష్క గుణతిలక అరెస్టయ్యాడు. సిడ్నీకి చెందిన ఓ మహిళ అత్యాచార అరోపణలు చేసిన నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేశారు. గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే జట్టును వీడాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిడ్నీ పోలీసులు.. శ్రీలంకకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ధనుష్కను ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. దీంతో శ్రీలంక జట్లు గుణతిలక లేకుండానే స్వదేశానికి బయల్దేరింది. కాగా, ఈ విషయంపై శ్రీలంక క్రికెట్ బోర్టు ఇంకా ప్రకటన విడుదల చేయలేదు.
ప్రపంచకప్లో భాగంగా నమీబియాతో మ్యాచ్లో గుణతిలక గాయపడడం వల్ల జట్టుకు దూరమయ్యాడు. అయితే, అతడి స్థానంలో మరో ఆటగాడు జట్టులో చేరే వరకు ఆస్ట్రేలియాలోనే ఉండాల్సిందిగా లంక క్రికెట్ బోర్డు అదేశించింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కీలక ఆటగాడిగా ఉన్న గుణతిలక తరచూ గాయాల బారిన పడుతూ జట్టుకు దూరమవుతున్నాడు. అతనికి పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో మంచి రికార్డు ఉంది.
ఇదీ చదవండి: T20 World Cup: 'ఫైనల్ రోజు కేక్ కట్ చేస్తా'.. విలేకరులతో కింగ్ కోహ్లీ చిట్ చాట్!
T20 worldcup: టీమ్‌ఇండియా ఛాంపియన్ అవ్వాలంటే అలా చేయాల్సిందే