ETV Bharat / sports

Shikhar Dhawan Odi Career : ఇవి ధావన్​ రికార్డ్స్ రేంజ్​​.. అయినా జట్టులోకి నో ఎంట్రీ!

author img

By

Published : Aug 12, 2023, 6:00 PM IST

Shikhar Dhawan Odi Career : టీమ్ఇండియా డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్.. జట్టుకు దూరమై ఎనిమిది నెలలు కావస్తోంది. అయితే కనీసం ద్వితీయ శ్రేణి జట్టుతో ఆసియా గేమ్స్​కైనా ధావన్​ను ఎంపిక చేస్తారని అనుకున్నారంతా. కానీ ఆసియా గేమ్స్ జట్టు ఎంపికలోనూ సెలెక్టర్లు ధావన్​కు మొండిచేయి చూపారు. కానీ ధావన్ నాలుగేళ్ల వన్డే కెరీర్ గణాంకాలు మాత్రం అతడిని నాణ్యమైన ఆటగాడిగానే చూపుతున్నాయి. మరి ఈ గణాంకాలు ఎలా ఉన్నాయంటే.

Shikhar Dhawan Odi Career
Shikhar Dhawan Odi Career

Shikhar Dhawan Odi Career : టీమ్ఇండియా సీనియర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ శిఖర్ ధావన్.. అనూహ్యంగా జట్టులో స్థానం కోల్పోయాడు. గతేడాది డిసెంబర్​లో బంగ్లాదేశ్ పర్యటన తర్వాత ధావన్​కు జట్టులో చోటు దక్కలేదు. అయితే తాజా ఐపీఎల్​లోనూ 142 స్ట్రైక్ రేట్​తో 373 పరుగులతో టచ్​లోకి వచ్చినట్లు కనిపించిన ధావన్.. ఈసారి కనీసం ఒక పర్యటన​లో ఎంపికవుతాడని భావించారు అతడి ఫ్యాన్స్​.

కానీ డబ్ల్యూటీసీ ఫైనల్, విండీస్ టూర్​లకు ధావన్​ ఎంపికకాలేదు. ఇక అసియా ఛాంపియన్స్​షిప్​నకు బీసీసీఐ .. కుర్రాళ్లతో కూడిన జట్టును సిద్ధం చేస్తుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ధావనే ఈ యువ జట్టుకు నాయకత్వం వహిస్తాడన్న వాదనలూ వినిపించాయి. కానీ అనుహ్యంగా యంగ్​ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్​కే.. సెలక్టర్లు మొగ్గుచూపారు. దీంతో ధావన్​కు మరోసారి నిరాశే ఎదురైంది. కానీ నాలుగేళ్లుగా వన్డేల్లో ధావన్ గణాంకాలు ఓసారి పరిశీలిస్తే.. మరీ అంత పేలవంగా ఏమీ లేదనిపిస్తుందనేది వాస్తవమైన మాట.

2019 ప్రపంచకప్​ తర్వాత ధావన్ 37 మ్యాచ్​లకుగాను.. 35 ఇన్నింగ్స్​ల్లో బ్యాటింగ్ చేశాడు. 41.03 సగటున 1313 పరుగులు చేశాడు ధావన్​. ఇందులో ఏకంగా 12 అర్ధశతకాలు ఉన్నాయి. ఇక పూర్తి వన్డే కెరీర్​ చూస్తే.. ఇప్పటి వరకు 167 మ్యాచ్​లు ఆడాడు. ఇందులో 44 సగటున ధావన్.. 6793 పరుగులు చేశాడు. వన్డే కెరీర్​లో 17 శతకాలు, 39 అర్ధశతకాలు సాధించాడు. కాగా 2015 ప్రపంచకప్​లోనూ 412 పరుగులు చేసి టీమ్ఇండియాలో కీలకంగా మారాడు.

అయితే తాజాగా ఆసియా గేమ్స్​కు ఎంపిక చేసిన జట్టులో తన పేరు లేకపోవడంపై ధావన్ రీసెంట్​గా స్పందించాడు. "చైనా అసియా గేమ్స్​కు వెళ్లే భారత జట్టులో నా పేరు లేకపోవడంతో నేను షాక్​కు గురయ్యా. ఏదిఏమైనా సెలెక్టర్ల నిర్ణయాన్ని గౌరవించాలి. యువ భారత జట్టు అదరగొట్టాలని ఆశిస్తున్నా" అని ధావన్ తన అభిప్రాయాన్ని చెప్పాడు.

ఇక టీమ్ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మతో కలిసి కొన్నేళ్లపాటు ఇన్నింగ్స్​ ఓపెన్​ చేశాడు శిఖర్ ధావన్. నిలకడైన ఆటతీరుతో, క్రీజులో కుదురుకున్నాక బౌలర్లపై ఎదురుడాడికి దిగుతూ బౌండరీల వర్షం కురిపించేవాడు. కాగా వరల్డ్ కప్ సమీపిస్తున్న తరుణంలో ధావన్​ పేరును పరిశీలనలోకి తీసుకోవాలంటూ అతడి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి ఇప్పుడు టీమ్ఇండియాలో ప్లేయర్ల మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆసియా కప్, ప్రపంచకప్​ జట్టు కూర్పు ఎలా ఉండనుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఆసియా క్రీడల్లో టీమ్ఇండియా.. కెప్టెన్​గా శిఖర్​ ధావన్!​.. కోచ్​ ఎవరో తెలుసా?

టీమ్​ఇండియాలో చోటు కోల్పోవడంపై స్పందించిన గబ్బర్​.. ఏమన్నాడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.