ETV Bharat / sports

తొలి వన్డేలో జింబాబ్వే చిత్తు, 10 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం

జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్​లో సత్తా చాటింది. ఆల్​రౌండ్ ప్రదర్శనతో పది వికెట్ల తేడాతో గెలుపొందింది. అదే సమయంలో పలు రికార్డులు సైతం నెలకొల్పింది.

author img

By

Published : Aug 18, 2022, 6:35 PM IST

Updated : Aug 18, 2022, 6:56 PM IST

NDIA VS ZIMBABWE
NDIA VS ZIMBABWE

INDIA VS ZIMBABWE ODI: జింబాబ్వేతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్​లో భారత్ శుభారంభం చేసింది. తొలి వన్డేలో ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించింది. జింబాబ్వే జట్టు నిర్దేశించిన 190 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ సమయోచిత బ్యాటింగ్​కు తోడు.. శుభ్​మన్​గిల్ సాధికారిక అర్ధశతకం తోడవడం వల్ల భారత్ సునాయాసంగా గెలుపొందింది.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన జింబాబ్వే పరుగులు చేసేందుకు చెటోడ్చింది. క్రమంగా వికెట్లు కోల్పోయింది. ఏ దశలోనూ కోలుకునేలా కనిపించలేదు. గాయంతో ఇన్నాళ్లూ క్రికెట్​కు దూరమైన దీపక్ చాహర్.. తన పునరాగమన మ్యాచ్​లో అద్భుతంగా రాణించాడు. జింబాబ్వే టాప్ ఆర్డర్​ను బెంబేలెత్తించాడు. ఆ జట్టు టాప్ 3 ప్లేయర్స్​ను చాహర్.. వెనక్కి పంపించాడు. మంచి లైన్ అండ్ లెంగ్త్​లో బంతులు సంధిస్తూ బ్యాట్స్​మన్​ను తిప్పలు పెట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్ తలో మూడు వికెట్లు పడగొట్టి రాణించడం వల్ల.. జింబాబ్వే జట్టు పేకమేడలా కూలిపోయింది. అయితే, జింబాబ్వే జట్టుకు బ్రాడ్ ఎవాన్స్, నంగార్వ కాస్త ఊరట కల్పించారు. ఇరువురు కలిసి తొమ్మిదో వికెట్​కు 70 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. వీరు ఆ మాత్రం పరుగులు చేయకపోతే.. జింబాబ్వే మరింత తక్కువ స్కోరుకే పరిమితమయ్యేది.

ఇక, 190 పరుగుల లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్​మన్ గిల్ ప్రత్యర్థి జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పనికానిచ్చేశారు. ఇన్నింగ్స్ ప్రారంభించిన ధావన్.. ఎదుర్కొన్న తొలి రెండు బంతుల్ని బౌండరీకి తరలించాడు. అయితే, ఆ తర్వాత నెమ్మదించాడు. ఇద్దరు బ్యాటర్లు వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ.. స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలోనే ఇద్దరూ అర్ధశతకాలు నమోదు చేశారు. ధావన్ 113 బంతుల్లో 81 పరుగులు చేశాడు. అందులో 9 బౌండరీలు ఉన్నాయి. ఆఖర్లో కాస్త వేగం పెంచి ఆడిన శుభ్​మన్.. 72 బంతుల్లోనే 82 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు. గిల్ ఇన్నింగ్స్​లో ఒక సిక్స్, 10 ఫోర్లు ఉన్నాయి.

రికార్డుల మోత
ఈ విజయంతో భారత్ ఓ అరుదైన రికార్డును నమోదు చేసింది. 2013 నుంచి ఇప్పటివరకు జింబాబ్వేపై వరుసగా 13 మ్యాచ్​ల్లో భారత్ విజయం సాధించింది. ఓ ప్రత్యర్థిపై అత్యధిక వరుస విజయాలు ఇవే కావడం విశేషం. అంతకుముందు, బంగ్లాదేశ్​పై (1988-2004 మధ్య) వరుసగా 12, న్యూజిలాండ్​పై (1986-88) 11 విజయాలు సాధించింది భారత్.

ఇక, పది వికెట్ల తేడాతో గెలుపొందిన మ్యాచుల్లో భారత్​కు ఇది రెండో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం విశేషం. 1998లో జింబాబ్వేపైనే 197 పరుగులు చేసి విజయం సాధించింది. అప్పుడు కూడా వికెట్ కోల్పోకుండా భారత్ గెలుపొందింది. ఆ తర్వాత భారత్​కు '10 వికెట్ల విజయాల్లో' ఇదే అత్యధిక స్కోరు. 2016లో 126 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేసి సాధించిన విజయం.. మూడో స్థానంలో ఉంది.

Last Updated : Aug 18, 2022, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.