ETV Bharat / sports

భారత క్రికెటర్లపై కరీబియన్​ పాట

వెస్టిండిస్​, భారత్​ ఆటగాళ్ల మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. అందుకే ఐపీఎల్​లో మన క్రికెటర్లతో కలిసి వాళ్లు చేసే రచ్చ, ఆటపాటలూ అభిమానులను ఎంతగానో అలరిస్తాయి. తాజాగా కరీబియన్​ ఆల్‌రౌండర్‌ డ్వేన్​ బ్రావో క్రికెటర్ల పేర్లతో ఒక మ్యూజిక్​ ఆల్బమ్​ విడుదల చేశాడు.

భారత క్రికెటర్లపై పాట పాడిన బ్రేవో
author img

By

Published : Feb 9, 2019, 10:47 PM IST

2016 టీ20 ప్రపంచకప్‌ సమయంలో ‘ఛాంపియన్‌’ అనే సాంగ్​తో ఉర్రూతలూగించాడు బ్రావో. సంగీతం అంటే బాగా ఇష్టపడే ఈ కరీబియన్​​... ఆసియా క్రికెటర్లపై పాడిన పాట ఆకట్టుకుంటోంది. కుమార సంగక్కర, మహేళ జయవర్ధనే, విరాట్‌ కోహ్లీ, ధోని, షకీబుల్‌ హసన్‌, షాహిద్ ఆఫ్రిదీ, రషీద్‌ ఖాన్‌లను ప్రస్తావిస్తూ ‘దిస్‌ వన్‌ ఈజ్‌ ఏషియా’ అంటూ పాట రూపొందించాడు. దీనిపై పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిదీ ప్రశంసల వర్షం కురిపించాడు.

  • Well @DJBravo47, this is definitely an improvement on the ‘Champion’ song, especially since you’ve included me in the lineup 😜. Wishing you all the very best with this new number, & I hope it gets just as popular! pic.twitter.com/VvK0RzsW8J

    — Shahid Afridi (@SAfridiOfficial) February 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
undefined

‘బ్రేవో అద్భుతం.. ఇది పక్కా మరో ఛాంపియన్‌ సాంగ్‌ అవుతుంది. ఈ పాటలో నా పేరు ప్రస్తావించడం ఆనందంగా ఉంది. పాట విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని ట్వీట్‌ చేశాడు అఫ్రిదీ.

అంతర్జాతీయ క్రికెట్​కు 2018 అక్టోబరులో వీడ్కోలు పలికిన ఈ విధ్వంసకర ఆటగాడు... ప్రస్తుతం టీ20, దేశవాళీ లీగ్‌ల్లో ఆడుతున్నాడు. ఆటతో పాటు గాత్రానికి పనిచెప్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.