సైరా నర్సింహారెడ్డి చిత్రానికి హైకోర్టు పచ్చజెండా ఊపింది. చిత్ర విడుదలలో జోక్యం చేసుకోలేమని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. సినిమాను కేవలం వినోద సాధనంగానే చూడాలని తెలిపింది. మహానుభావుల చరిత్రను ఉన్నది ఉన్నట్లు ఎవరూ చూపించరని ధర్మాసనం అభిప్రాయపడింది. కొందరిని కల్పిత పాత్రలతో చూపిస్తారని.. వివరించింది. గతంలో గాంధీజీ, మొఘల్ సామ్రాజ్యాన్ని తెరకెక్కించిన చిత్రాలను కోర్టు ప్రస్తావించింది. సినిమా నచ్చేది, నచ్చనిది ప్రేక్షకులకు వదిలేయాలని... ప్రస్తుతం తాము సైరా సినిమా విడుదలను ఆపలేమని స్పష్టం చేసింది. చిత్రంపై వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మొదట బయోపిక్ అని, ఇప్పుడు చరిత్ర అని తప్పుదోవ పట్టిస్తున్నారని తమిళనాడు తెలుగు యువసంఘం నాయకులు పిటిషన్ దాఖలు చేశారు.
సైరా నర్సింహారెడ్డి చిత్రానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ - High court green signal for Saira Narsimha Reddy film
'సైరా నర్సింహారెడ్డి' విషయంలో జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. సినిమాను కేవలం వినోద సాధనంగానే చూడాలని పేర్కొంది. సైరా చిత్రంపై వేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.