వ్యాఖ్యాత, నటి అనుసూయ ట్విట్టర్ ద్వారా తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు స్పందించారు. 'యాక్ట్రెస్ మసాల' ట్విట్టర్ ఖాతా నిర్వహిస్తున్న వ్యక్తి కోసం గాలిస్తున్నామని సీసీఎస్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు.
లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని తెలిపారు. పలువురు నటులుపైనా అభ్యంతకరమైన పోస్టులు పెట్టారని... వారు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామన్నారు.
ఇదీ చూడండి :