- " class="align-text-top noRightClick twitterSection" data="">
- ఈ సినిమా మార్చి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
మర్డర్‌ను ఛేదించే కేసు నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, అజూరే ఎంటర్‌టైన్‌మెంబ్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ లుక్‌ను షారుక్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. పోస్టర్లలో అమితాబ్, తాప్సీ బాధపడుతున్నట్లుగా కనిపించారు. పోస్టర్‌పై 'ప్రతిసారీ పగ తీర్చుకోవడం సరైంది కాదు. అలాగని ప్రతిసారీ క్షమించడమూ సరికాదు' అని రాసున్న డైలాగ్ ఆకట్టుకుంటోంది.
షారుక్ ఈ ఫొటోలను షేర్ చేస్తూ.. 'అమితాబ్‌జీ.. మీపై పగ తీర్చుకోవడానికి వస్తున్నా. సిద్ధంగా ఉండండి' అని సరదాగా ట్వీట్ చేశారు. ఇందుకు అమితాబ్ స్పందిస్తూ.. ' షారుక్...పగ తీర్చుకునే సమయం దాటిపోయింది. ఇప్పుడు అందరికీ పగను పంచాల్సిన సమయం వచ్చింది' అని పోస్టర్లను ఉద్దేశిస్తూ చమత్కరించారు.