చిన్న ప్రయాణమైనా సరే హెడ్‌సెట్ మర్చిపోతే ఎంతో వెలితిగా ఫీలవుతారు చాలా మంది. నిజంగానే రోజువారీ జీవితంలో హెడ్‌సెట్ భాగమైన వాళ్ల సంఖ్యా ఎక్కువే. అయితే, వాటిని వాడిన తర్వాత అలాగే బ్యాగులో పెట్టినా, టేబుల్ మీద ఉంచినా తీగలు ఒకదానికొకటి చుట్టుకుని చిక్కుపడిపోతూ ఉంటాయి. అలాంటి ఇబ్బందిని అధిగమించేలా మార్కెట్లోకి వస్తున్నవే ‘ఇయర్‌ఫోన్ కేబుల్ ఆర్గనైజర్లు’. హెడ్‌సెట్ వాడిన వెంటనే వైర్లను మడిచేసి వీటిని చుట్టామంటే ఎలా పడేసినా అవి చిక్కులు పడిపోకుండా ఉంటాయి. రకరకాల బొమ్మల ఆకృతుల్లో వచ్చే ఈ ఆర్గనైజర్లు చూసేందుకూ ముచ్చటగా ఉంటున్నాయి.
ఇదీ చదవండి: సైబర్ మోసగాళ్లను నమ్మితే... సర్వం సమర్పయామి..!