తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన స్నేహ... 'ఫేస్ టచ్ కాషన్ అలారం' రూపొందించింది. కరోనా నియంత్రణలో భాగంగా యువతి వినూత్న ప్రయోగంతో ఆకట్టుకుంది. చేతులతో ముక్కు, నోరు, కళ్లు తాకకూడదనే వైద్యుల సూచనల మేరకు.... ఓ ప్రత్యేక అలారం తయారు చేసింది.
మనకు తెలియకుండానే చేతులు ముఖ భాగాలను తాకేందుకు వెళ్లినప్పుడు, ఇతరులతో చేయి కలిపే ప్రయత్నం చేసినప్పుడు... ఫేస్ టచ్ కాషన్ అలారం దానంతట అదే మోగుతుంది. వెంటనే మనల్ని అప్రమత్తం చేస్తుంది. కరోనా సమయంలో తన వంతు బాధ్యతగా ఏమైనా చేయాలనే ఉద్దేశంతోనే ఈ అలారం తయారు చేశానని చెబుతోంది స్నేహ.
ఇదీ చూడండి : అతడి క్లారిటీ చూసి పోలీసులే షాక్ అయ్యారు