LIVE టీడీపీ నేత అచ్చెన్నాయుడు మీడియా సమావేశం- ప్రత్యక్ష ప్రసారం - TDP Atchannaidu Live
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 2, 2024, 1:03 PM IST
|Updated : Jan 2, 2024, 1:26 PM IST
TDP Leader Atchannaidu Press Meet Live: సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ ప్రచార పర్వాన్ని ముమ్మరం చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనవరి 5వ తేదీ నుంచి పార్లమెంట్ స్థానాల వారీగా బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. 25 పార్లమెంటు స్థానాల్లో 25 బహిరంగ సభలు పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. 25 బహిరంగ సభల నిర్వహణ, కార్యక్రమాలు, రూట్ మ్యాప్‌నకు సంబంధించిన ప్రణాళికలను ఆ పార్టీ నేతలు సిద్ధం చేస్తున్నారు. ప్రతి సభకు లక్ష మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ప్రతి పార్లమెంట్ స్థానంలో బహిరంగ సభను ఏ అసెంబ్లీ స్థానం పరిధిలో నిర్వహించాలి? ఏయే రోజున ఏయే కార్యక్రమాలు నిర్వహించాలి? అనే విషయాలపై కమిటీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భవిష్యత్తు కార్యక్రమాలపై అచ్చెన్నాయుడు మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం.