LIVE: న్యాయవాదులతో పవన్ కల్యాణ్‌ సమావేశం- ప్రత్యక్ష ప్రసారం - Pawan Kalyan Live

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 5, 2024, 2:04 PM IST

Updated : Jan 5, 2024, 3:14 PM IST

Pawan Kalyan Meeting with Lawyers Live: భూ కబ్జాదారులకు వరంగా మారనున్న ఏపీ భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు. నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని కబ్జాలకు పాల్పడే వారికి ఈ చట్టం చుట్టంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే పేదలు భూములకు భద్రత ఉండదని పేర్కొన్నారు. పేదల భూములు అక్రమ రికార్డులతో ఆక్రమించేవారు భూ కబ్జాదారులు పెరిగిపోతారని తెలిపారు. ఈ చట్టం వలన ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. ఈ చట్టం అమల్లోకి వస్తే సివిల్ కేసులు దాఖలు చేయడానికి వీలుండదని చెప్పారు. ప్రభుత్వం తక్షణం ఏపీ భూహక్కుల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలందరూ ఏకతాటిపై నిలబడి ఈ చట్టాన్ని రద్దు చేసేంతవరకు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్​తో న్యాయవాదులు సమావేశం నిర్వహించారు. న్యాయవాదుల ఆందోళనకు పవన్ తన మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్​తో న్యాయవాదుల మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం.

Last Updated : Jan 5, 2024, 3:14 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.