LIVE: విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - CEC Press Meet Live
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 10, 2024, 4:39 PM IST
|Updated : Jan 10, 2024, 5:14 PM IST
CEC Press Meet Live: ఎన్నికల విధుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే విధుల నుంచి తప్పుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లను హెచ్చరించింది. రాజకీయపార్టీల ఒత్తిళ్లకు తలొగ్గుతూ నాయకులతో అనుబంధం కొనసాగిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. ఎన్నికల సన్నద్ధత, ఓటర్ల జాబితాల అంశంపై సమీక్షించిన కేంద్ర ఎన్నికల బృందం అర్హుల ఓట్ల తొలగింపునకు ఫాం-7లు పెట్టినవారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని కలెక్టర్లను, ఎస్పీలను నిలదీసింది. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత, ఓటర్ల జాబితా తయారీ సహా వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, కమిషనర్లు అరుణ్ గోయల్, అనూప్‌చంద్ర పాండేలతో కూడిన ప్రతినిధి బృందం విజయవాడలో సమీక్ష నిర్వహించింది. రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలుసని ఎవరెవరు ఎలా వ్యవహరిస్తున్నారో గమనిస్తున్నామంది. ప్రతి ఒక్కరిపై నివేదికలున్నాయని అధికారులు ఏదైనా పార్టీకి లేదా నాయకులకు అనుకూలంగా, వారికి మేలు చేకూర్చేలా వ్యవహరిస్తే కఠిన చర్యలుంటాయని కలెక్టర్లు, ఎస్పీలను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం.