ETV Bharat / lifestyle

జుట్టు ఊడిపోకుండా చిట్కాలు.. ప్రయత్నిద్దామా మరీ

వయసు పెరిగేకొద్దీ జుట్టు ఊడటమనేది సహజం. చిన్నప్పుడు పెద్ద జుట్టు ఉంటే ఇప్పుడూ అలాగే ఉండాలనుకుంటారు. గుడ్డు, చికెన్ లాంటి ప్రొటీన్ ఫుడ్ తింటున్నా జట్టు ఊడిపోతోందా? ఏం చేయాలో అర్థం కావట్లేదా అయితే ఈ చిట్కాలు మీకోసమే..

జుట్టు ఊడిపోకుండా చిట్కాలు
జుట్టు ఊడిపోకుండా చిట్కాలు
author img

By

Published : Jul 26, 2020, 12:10 AM IST

Updated : Jul 26, 2020, 12:17 AM IST

మెనోపాజ్‌ సమయంలో, వంశపారంపర్యమైన కారణాలు, హార్మోన్‌లలో వచ్చే హెచ్చుతగ్గుల వల్ల కూడా జుట్టు ఊడుతుంది. రోజుకు 50-100 వెంట్రుకలు ఊడితే పట్టించుకోనవసరం లేదు. ఇంతకంటే ఎక్కువ ఊడితే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి.

  • హార్మోన్ల తేడాలు, శరీరంలో ఇనుములేమి, విటమిన్‌-బి12, విటమిన్‌-డి3 తక్కువగా ఉన్నా, పీసీఓఎస్‌ సమస్య ఉన్నా జుట్టు ఊడుతుంది. తినే ఆహారంలో ఇనుము, కాపర్‌, విటమిన్‌-బి1 ఉండేలా చూసుకోవాలి. ప్రొటీన్‌ బానే తీసుకుంటున్నారు కాబట్టి ఒకసారి థైరాయిడ్‌ పరీక్ష కూడా చేయించుకోండి. ఒత్తిడి ఉన్నా, మానసిక సమస్యలున్నా కూడా జుట్టు ఊడిపోతుంది.
  • గింజలు, విత్తనాలు తినాలి. వీటిల్లో ఒమేగా-3 ఫ్యాటీయాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వాల్‌నట్స్‌, అవిసెగింజలు తీసుకోవాలి. పాలకూరలో ఇనుముతోపాటు విటమిన్‌-డి2 ఉంటుంది.పోషకాహార లోపం లేకుండా చూసుకోవాలి. ఇనుము ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, బీన్స్‌ తీసుకోవాలి. వారానికి రెండు, మూడు సార్లు చేపలు తినాలి.
  • విటమిన్‌-ఎ ఉండే క్యారెట్లు, గుడ్లు తీసుకోవాలి. అలాగే విటమిన్‌-బి12, విటమిన్‌-సి ఎక్కువగా ఉండే ఆహారం తినాలి.
  • యోగా, ధ్యానం, వాకింగ్‌ లేదా వ్యాయామాలు చేయాలి. ఆర్గానిక్‌ హెయిర్‌ డైలు మాత్రమే వాడాలి. మందార ఆకులతో ప్యాక్‌ వేసుకుంటే వెంట్రుకలు చిట్లవు.

ఈ జాగ్రత్తలన్నీ పాటించినా జుట్టు ఊడిపోతే వైద్యులను సంప్రదిస్తే అవసరాన్ని బట్టి వాళ్లు చికిత్స అందిస్తారు.

ఇదీ చదవండి బియ్యం కడిగిన నీటితో అందం, ఆరోగ్యం!

Last Updated : Jul 26, 2020, 12:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.