ETV Bharat / lifestyle

సొంతింటికి వలసకూలీ ప్రయాణం.. దారిలోనే ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం! - సొంతూరుకు వెళ్తూ వాహనంలోనే వలసకూలీ ప్రసవం.. తల్లీబిడ్డా క్షేమం

సొంతూరుకు వెళ్తున్న ఓ వలస కూలీ వాహనంలోనే ప్రసవమైంది. బిహార్​ నుంచి తెలంగాణకు వచ్చిన మహిళ.. తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు ర్వైల్వేష్టేన్​కు వెళ్లేందుకు ఆటో ఎక్కింది. అందులోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. పుట్టిన బిడ్డతో సొంతూరికి పయనమయ్యారు.

migrant women delivered in auto
వాహనంలోనే వలసకూలీ ప్రసవం
author img

By

Published : Jun 12, 2021, 8:58 AM IST

సొంతూరుకు వెళ్తున్న ఓ మహిళకు వాహనంలోనే ప్రసవమైంది. తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారంలో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులకు బిహార్‌, మధ్యప్రదేశ్‌కు చెందిన కూలీలు 60 మంది వచ్చారు. వారిలో బిహార్‌కు చెందిన వాణిదేవి దంపతులు కూడా ఉన్నారు. వర్షాలు ప్రారంభమవడం వల్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. పనులు ఆగిపోవటం వల్ల కూలీలు.. బిహార్‌ వెళ్లేందుకు రైలు టికెట్‌లు బుక్‌ చేసుకున్నారు.

migrant women delivered in auto
వాహనంలోనే వలసకూలీ ప్రసవం

చిన్నగూడూరు నుంచి కాజీపేటకు వెళ్లేందుకు తోటి కూలీలతో కలిసి టాటా ఏస్‌ వాహనంలో బయలుదేరారు. ఈ క్రమంలో దంతాలపల్లి శివారులోకి చేరుకున్నాక వాణిదేవికి పురిటి నొప్పులు వచ్చాయి. అదే వాహనంలో సాధారణ కాన్పు పొంది ఆడపిల్లకు వాణిదేవి జన్మనిచ్చింది.

ఈ విషయాన్ని వాణీదేవి భర్త ముఖేష్‌... తన గుత్తేదారు చెన్నారెడ్డి దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న గుత్తేదారు.. తల్లీబిడ్డలను తన కారులో స్థానిక పీహెచ్​సీకి తరలించాడు. సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల.. తొర్రూరులోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడా అదే పరిస్థితి నెలకొనగా.. కాజీపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అనంతరం.. వారిని రైలులో బిహార్‌ పంపించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు గుత్తేదారు చెన్నారెడ్డి విజ్ఙప్తి చేశారు. ఈ విషయాన్ని వైద్య అధికారుల దృష్టి తీసుకెళ్లగా.. వాళ్లు మాత్రం బాధితులు ఆసుపత్రికే రాలేదని బుకాయిస్తున్నారు.

ఇదీ చూడండి:

రాష్ట్రానికి మరో మల్టీమోడల్​ లాజిస్టిక్స్‌ పార్క్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.