రోజూ పొద్దునే సమయం కేటాయించలేకపోతే అసలు వ్యాయామమే మానేయొద్దు. రోజులో మీకు వీలున్నప్పుడు ఓ అరగంట నడకకు కేటాయించుకోండి. లేదంటే పావుగంట చొప్పున వీలున్నప్పుడు 4 సార్లు చేయండి. క్రమంగా నడకకు అలవాటు పడతారు.
వేగంగా నడిస్తే మంచిదే... అలాగని ఒక్కసారే అది సాధ్యపడకపోవచ్చు. మీకు సౌకర్యంగా అనిపించినంత వేగంగా నడిస్తే సరి. అసలంటూ మొదలుపెడితే... కొన్నాళ్లకు స్పీడు పెరుగుతుంది. సాధారణంగా చదునుగా ఉండే మార్గం కంటే కాస్త ఎత్తుగా ఉండే ప్రాంతాల్లో (కొండలు, గుట్టలు లాంటి ప్రదేశాల్లో) నడవడం వల్ల ఎక్కువ కెలోరీలు ఖర్చవుతాయి. ఫలితంగా.. శ్వాస రేటు పెరుగుతుంది. ఆక్సిజన్ సైతం శరీరానికి సరఫరా ఎక్కువగా ఉంటుంది.
నడవడం వల్ల బరువు తగ్గడమే కాక కాళ్లు, చేతులు, కీళ్ల కండరాలు బలంగా మారతాయి. ఎముకలు గట్టిపడతాయి. వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అయితే... ప్రస్తుతం బయట వాకింగ్ ట్రాక్‌ల మీద, రోడ్లమీద నడిచే పరిస్థితులు లేవు కాబట్టి ఉన్నచోటే నిలబడి నడవండి. ఇది కూడా ఇప్పుడు ట్రెండే.
ఇదీ చదవండి: