ETV Bharat / lifestyle

BHARAT BIOTECH: స్వల్ప వ్యవధిలో టీకా అందించాం: భారత్​ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల - కిమ్స్ ఆస్పత్రి

శాస్త్ర, పరిశోధన, ఆవిష్కరణల్లో దేశం పురోగతి సాధించిందని భారత్​ బయోటెక్​ ఛైర్మన్​, మేనేజింగ్​ డైరక్టర్​ డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు. గతంలో వ్యాక్సిన్ క్లినికల్​ ట్రయల్స్​ పూర్తి కావాలంటే ఏళ్ల తరబడి సమయం పట్టేదని.. మారుతున్న కాలంలో సాంకేతికత పెరిగి ఇప్పుడు ట్రయల్స్ త్వరగా పూర్తవుతున్నాయని వెల్లడించారు.

BHARAT BIOTECH
BHARAT BIOTECH
author img

By

Published : Jul 29, 2021, 10:34 AM IST

సాధారణంగా ఒక టీకా తయారు చేయాలంటే ఎన్నో సంవత్సరాల కాలం పడుతుందని, ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో తక్కువ సమయంలోనే కరోనా వైరస్​కు విజయవంతంగా టీకాను అందిచగలిగామని భారత్​ బయోటెక్​ ఛైర్మన్​, మేనేజింగ్​ డైరెక్టర్​ డాక్టర్​ కృష్ణ ఎల్ల అన్నారు. కరోనా లాంటి మహమ్మారులను తిప్పికొట్టడానికి మానవాళి ముందున్న పరిష్కారం టీకాలేనని పేర్కొన్నారు. బుధవారం ప్రపంచ హెపటైటిస్​ దినం (World Hepatitis Day) సందర్భంగా సికింద్రాబాద్​ కిమ్స్​ ఆస్పత్రి (KIMS Hospital) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

గతంలో ఏళ్ల తరబడి ఆగాల్సి వచ్చేది..

ఈ సందర్భంగా కిమ్స్​ వైద్యులు, సిబ్బందిని ఉద్దేశించి డాక్టర్ ఎల్లా మాట్లాడారు. మానవాళికి పెనుముప్పుగా మారుతున్న హెపటైటిస్-బీ వ్యాధికి తక్కువ ధరలోనే వ్యాక్సిన్​ అందుబాటులో ఉందన్నారు. గతంలో ఒక వ్యాక్సిన్​ క్లినికల్​ ట్రయల్స్​ పూర్తి కావాలంటే ఏళ్ల తరబడి సమయం పట్టేదని, ప్రస్తుతం పెరుగుతున్న సాంకేతికతతో వేగంగా చేయగలుగుతున్నామన్నారు. మొదట రోటా వైరస్ వ్యాక్సిన్​ అందుబాటులోకి తెచ్చేందుకు భారత్​ బయోటెక్​కు ఎక్కువ సమయం పట్టిందని.. అదే కొవిడ్​కు తక్కువ సమయంలోనే టీకా ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసి కోట్లమంది ప్రాణాలు కాపాడగలిగామన్నారు.

దేశానికే గర్వకారణం

శాస్త్ర పరిశోధన, ఆవిష్కరణల్లో భారత్​ పురోగమస్తోందని డాక్టర్​ కృష్ణ ఎల్ల తెలిపారు. కరోనాను ఎదుర్కోనేందుకు వైద్యులు, సిబ్బంది చేసిన కృషిని ఆయన అభినందించారు. కరోనాకు టీకా తేవడం దేశానికే గర్వకారణమని కిమ్స్ ఆస్పత్రుల ఎండీ డాక్టర్ బి.భాస్కర్​రవు అన్నారు. భారత్​ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిపిన ఘనత భారత్​ బయోటెక్​కు దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా కొవిడ్​ సంక్షోభంలో ముందుండి సేవలందించిన 300 మంది డాక్టర్లు, వైద్య సిబ్బందిని జ్ఞాపికలతో సత్కరించారు. అనంతరం కిమ్స్ ఆస్పత్రుల ఛైర్మన్​ బి.కృష్ణయ్య, ఎండీ డాక్టర్​ బి.భాస్కర్​రావు, డాక్టర్​ కృష్ణ ఎల్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ సీనియర్​ వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

Jagananna Vidya Deevena: 'జగనన్న విద్యా దీవెన'.. నేడే రెండో విడత నిధుల విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.