ETV Bharat / lifestyle

కుర్తీ స్కర్ట్‌... కొత్త లుక్..‌!

సల్వార్‌ ప్యాంటు, పటియాలా, లెగ్గింగ్‌, జీన్సు, పలాజో... ఇలా ఇప్పటివరకూ కుర్తీ కింద వేసుకునే ప్యాంటుల్ని మార్చుతూనే ఫ్యాషన్లు వచ్చాయి. అందుకు పూర్తి భిన్నంగా ఇంకాస్త ట్రెండీగా వచ్చిందే ఈ ‘పొడవు కుర్తీ-స్కర్ట్‌’ ఫ్యాషన్‌. ఇది ఏకంగా ప్యాంటునే పక్కకు తోసి కుర్తీ కిందకు స్కర్ట్‌ని మ్యాచ్‌ చేసింది మరి.

కుర్తీ స్కర్ట్‌... కొత్త లుక్‌!
author img

By

Published : Feb 28, 2021, 8:32 PM IST

కుర్తీ... ఎంత హుందాగా ఉంటుందో అంత ఫ్యాషన్‌గానూ సౌకర్యంగానూ ఉంటుంది. డిజైన్‌లను బట్టి ఇటు క్యాజువల్‌ వేర్‌గానూ అటు పండుగలూ ప్రత్యేక సందర్భాలకూ ధరించొచ్చు. వీటిలో మోడ్రన్‌గా కుట్టినవాటినీ సందర్భానికి తగ్గట్లు తొడిగేయొచ్చు. అందుకే, సంవత్సరాలు గడిచినా.. కొత్త పోకడలు ఎన్ని పుట్టుకొచ్చినా.. కుర్తీల ఫ్యాషన్‌ మాత్రం ఎవర్‌గ్రీన్‌గానే ఉంది.

కొత్త కాంబినేషన్..

నిజానికి అలా ఉండడానికి మరో కారణం- ఫ్యాషన్‌ గురూలు కుర్తీని మార్చకపోయినా దాని కింద వేసే ప్యాంట్లలో తరచూ కొత్త డిజైన్లను తీసుకురావడమే. అవును మరి, కుర్తీ కింద మామూలు ప్యాంటు వేసినపుడు లుక్‌ ఒకలా ఉంటే... జీన్సు, లెగ్గింగ్‌ వేసినప్పుడు మరోలా ఉంటుంది. పలాజో, షరారా... లాంటివి ఇంకాస్త కొత్త లుక్‌ని తెస్తాయి. వీటన్నిటికీ పూర్తి భిన్నంగా, సరికొత్తగా వచ్చిందే కుర్తీ-స్కర్ట్‌ కాంబినేషన్‌.

స్కర్టుల మీద మామూలు టాప్‌లు వేసుకోవడం తెలిసిందే. కానీ, అవి మరీ ఆధునికంగానూ ఫ్యాషన్‌గానూ ఉంటాయి కాబట్టి, అన్ని సందర్భాల్లోనూ వేసుకోలేరు. అదే కుర్తీ కింద స్కర్టుని వేస్తే, ఫ్యాషన్‌గానూ హుందాగానూ కూడా ఉంటుంది. కాబట్టి, వీటిని టీనేజీ అమ్మాయిలు కాలేజీలకూ వేసుకెళ్లొచ్చు, ముద్దుగుమ్మలు ఆఫీసులకూ తొడిగేయొచ్చు. ఇందులో సింపుల్‌గా, ఆధునికంగా ఉండే వాటితో పాటు పండుగలూ ఫంక్షన్‌లకు వేసుకునేందుకు ఎంబ్రాయిడరీ చేసినవీ వస్తున్నాయి.

సౌకర్యంగా అందంగా...

లెగ్గింగులు సౌకర్యంగానే ఉంటాయి కానీ.. బనియన్‌ క్లాత్‌తో తయారయ్యే వాటిని వేసవిలో వేసుకోవాలంటే కష్టమే. పైగా ఒంటిని పట్టేసినట్లూ ఉండడం వల్ల ఆ ప్యాంటుల్ని రోజూ వెయ్యడం కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. స్కర్టులతో ఆ సమస్యే ఉండదు. చక్కగా గాలి ఆడుతూ సౌకర్యంగా ఉంటాయి. కుచ్చులతో పెద్దగా ఉండే వీటిమీద మామూలు ప్యాంట్లూ లెగ్గింగ్‌లతో పోల్చితే డిజైన్లు కూడా బాగా కనిపించి డ్రెస్‌కి మరింత అందం వస్తుంది. అంతేకాదు, వీటిని వేసుకుని నడుస్తుంటే నడకతో పాటు ఆ స్కర్టు కుచ్చులు నాట్యమాడుతున్నట్లే ఉంటాయనడం అతిశయోక్తి కాదు. ఈ కుర్తీ-స్కర్ట్‌లు చున్నీతోనూ చున్నీ లేకుండానూ సెట్‌లుగా వస్తున్నాయి. విడిగానూ కుర్తీకి మ్యాచ్‌ అయ్యే స్కర్టుని కొనుక్కుని మనం కూడా సెట్‌ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో కుర్తీ మీదికి వేరే ఏదైనా ప్యాంటుని జత చేయొచ్చు. స్కర్టు మీదికి షర్టునో పొట్టి టాప్‌లనో వేసుకోవచ్చు. ఇంతకీ మీ వార్డ్‌రోబ్‌లో ఉన్నాయా పొడవు కుర్తీ- స్కర్టులు..?

ఇదీ చూడండి: 100 కి.మీ సైకిల్​ రైడ్​లో హుషారుగా మంచు లక్ష్మి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.