తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రాములవారు మూడోరోజు వరహా అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బేడా మండపంలో... స్వామి వారికి అర్చకులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరాగా..... వారికి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
అవతార విశిష్టత
పూర్వ కాలంలో మానవ సృష్టి కోసం సముద్రంలోని భూమిని పైకి తీసేందుకు విష్ణుమూర్తి వరాహావతారం ఎత్తినట్లు అర్చకులు తెలిపారు. ఈ అవతారం ఎత్తిన క్రమంలో రాక్షస రాజు హిరణ్యాక్షుడిని సంహరించినట్లు వివరించారు. ఈ అవతారంలో స్వామివారిని దర్శించుకోవడం వల్ల రాహు గ్రహ బాధలు తొలగుతాయని తెలిపారు.
ఇదీ చూడండి: పీఎస్‌ఎల్‌వీ-సి50 ప్రయోగం విజయవంతం