హైదరాబాద్ శంషాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. బాలికను బెదిరించి ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గోపి శంషాబాద్‌లో ఉంటున్నాడు. స్థానికంగా నివాసముండే బాలికను.. గన్ చూపించి బెదిరించాడు. ఆమె తల్లిదండ్రులను కాల్చేస్తానంటూ పలుమార్లు అత్యాచారం చేశాడు.
ఆ ఘటన దృశ్యాలను సెల్ఫోన్లో రికార్డు చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెపితే.. చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. భయపడిన బాలిక విషయాన్ని ఎవరికి చెప్పలేకపోయింది. అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అసలు విషయం బయటపడింది. అనంతరం ఫిర్యాదు చేయగా.. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి: