తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం భీమారంలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి వేడుకల్లో కొందరు యువకులు ఘర్షణ పడ్డారు. వాగ్వాదం క్రమంగా పెరిగి ఊరేగింపు అనంతరం పూదరి లక్ష్మణ్ అనే యువకున్ని అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు కత్తితో పొడిచి హత్య చేశారు.
యువకుడి హత్యతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కోరుట్ల సీఐ రాజశేఖర రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: