ETV Bharat / jagte-raho

ఏటీఎం కార్డు మార్చి... సింగరేణి ఉద్యోగిని ఏమార్చి... - sudimalla incident

ఏటీఎంకు వచ్చిన ఓ సింగరేణి ఉద్యోగిని ఏమార్చి... డబ్బు కొట్టేశాడు ఓ యువకుడు. ఏటిఎం కార్డు మార్చి మరీ... బాధితుని అకౌంట్లో నుంచి రూ.40 వేల నగదు నొక్కేశాడు. అసలు విషయం ఆలస్యంగా తెలుసుకున్న బాధితుడు లబోదిబోమంటూ... పోలీసులను ఆశ్రయించాడు.

kothagudem district telangana
kothagudem district telangana
author img

By

Published : Dec 21, 2020, 8:17 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు సుదిమల్ల ఎస్బీహెచ్ ఏటీఎం వద్ద ఒక యువకుడు సింగరేణి ఉద్యోగిని బురిడి కొట్టించాడు. ఏటీఎం సెంటర్లో రూ.40 వేలు దొంగిలించాడు. సింగరేణి ఉద్యోగి కొలుకుల అర్జున్ రావు... ఏటీఎం కార్డు తీసుకొని డబ్బుల కోసం సుదిమల్ల ఎస్బీఐ ఏటీఎం కేంద్రానికి వెళ్ళాడు.

అర్జున్​రావుకు డబ్బులు తీయడం రాకపోవడం వల్ల అక్కడే ఉన్న ఒక యువకుడికి ఏటీఎం కార్డు ఇచ్చి డబ్బులు తీసివ్వమని కోరాడు. అర్జున్ రావు... తన పిన్ నంబర్ చెప్పటం వల్ల యువకుడు దాన్ని తప్పుగా కొట్టి డబ్బులు రావట్లేదని అబద్ధం చెప్పాడు. ఏటీఎం కార్డు మార్చి అర్జున్​రావుకు వేరే కార్డు ఇచ్చాడు. దాన్ని గమనించకుండా... అర్జున్ రావు ఇంటికి వెళ్లిపోయాడు.

వెంటనే ఆ యువకుడు అసలు ఏటీఎం కార్డుతో రూ.40వేలు డ్రా చేశారు. డబ్బులు తీసిన విషయం సెల్​ఫోన్​కి వచ్చిన సందేశాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితుడు... బ్యాంకు అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో పట్టణంలోని పలు ఏటీఎం కేంద్రాల వద్ద బ్యాంకు అధికారులు, పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు.

ఇదీ చూడండి:

కంటైనర్​లో మంటలు.. 40 ద్విచక్రవాహనాలు దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.